Nenu Ready Still
ఎంటర్‌టైన్మెంట్

Nenu Ready Film: హవీష్, కావ్య థాపర్ రామోజీ ఫిల్మ్ సిటీలో..

Nenu Ready Film: యంగ్ హీరో హవీష్ (Hero Havish) నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ మధ్య ఆయన వరసగా సినిమాలు చేశారు. కానీ ఏది సక్సెస్ కాకపోవడంతో.. కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి మంచి సబ్జెక్ట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఆయన ‘ధమాకా’ దర్శకుడిని నమ్ముకున్నారు. హీరో హవీష్, డైరెక్టర్ త్రినాధరావు (Trinadharao Nakkina) నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘నేను రెడీ’ (Nenu Ready). ఇందులో హవీష్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ తెలిపారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో..
తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని మేకర్స్ తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 1) నుంచి హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైందని, ఈ షెడ్యూల్‌లో హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, షూటింగ్ లొకేషన్ ‌నుంచి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇందులో హవీష్, కావ్యలతో పాటు మరికొందరు నటీనటులు ఉన్నారు. ‘నేను రెడీ’ సినిమా కోసం త్రినాథరావు నక్కిన.. తన మార్క్‌లోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్‌ని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉండబోతుందని నిర్మాత నిఖిల కోనేరు తెలుపుతున్నారు.

Also Read- Ramanaidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్‌లో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపులు.. వేధించిందెవరో తెలిస్తే షాకవుతారు?

ప్రధాన తారాగణం వీరే..
హవీష్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అద్భుతమైన తారాగణం నటిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ప్రముఖ నటీనటులందరూ కీలకమైన పాత్రల్లో అలరించబోతున్నారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన ఓ బ్యూటీ కూడా మెరవనుందని టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. నిజార్ షఫీ డీవోపీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ కథ, డైలాగ్స్ అందిస్తున్నారు.

Also Read- Jayammu Nichayammu Raa: రియల్ హీరోలతో రియాలిటీ టాక్ షో.. బొమ్మ అదుర్స్ కదూ..

త్రినాథరావు నక్కినకు చాలా కీలకం
హీరో హవీష్‌కు మాత్రమే కాదు.. ఈ ప్రాజెక్ట్ దర్శకుడు త్రినాథరావు నక్కినకు కూడా చాలా కీలకం కానుంది. ఆయన నుంచి ఇంతకు ముందు వచ్చిన ‘మజాకా’ చిత్రం అంతగొప్పగా సక్సెస్ సాధించలేదు. దీంతో మరోసారి తనని తాను నిరూపించుకునేందుకు ఈ ప్రాజెక్ట్‌ కోసం త్రినాథరావు నక్కిన తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?