CM Revanth Reddy: విద్యకు దైవ భూమి కేరళ అంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఆయన కేరళలో మాట్లాడుతూ…దేశంలో విద్యకు,కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉన్నదన్నారు. దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ అని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేరళ రాష్ట్రంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
10 వ, 12 వ తరగతి తర్వాత,సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదన్నారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి అన్నారు. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధమని, అదే అందరికీ గొప్ప శక్తి అని తెలిపారు. విద్యకున్న ప్రాధాన్యత గురించి తాను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నానని, ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిందన్నారు.
Also Read: Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కా.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
ఇక కేసీ వేణుగోపాల్ గారు ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున వారు గొంతుకగా నిలుస్తున్నారన్నారు. కేసీ వేణుగోపాల్ తన నియోజకవర్గంతో పాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు.
విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ
వేణుగోపాల్ 2006 లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉన్నదన్నారు. 10 వ ,12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానదోహదపడుతున్నాయన్నారు. ఈ ఏడాది వంద శాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారన్నారు. విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్ కు అభినందనలు తెలిపారు. వేణుగోపాల్ తీసుకున్న ఈ చొరవను ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
11055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ
వచ్చే పదేళ్లలో తెలంగాణకను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపెట్టుకున్నామన్నారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామన్నారు. కేవలం 55 రోజుల్లో 11055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్నిర్మించబోతున్నామన్నారు. ఒక్కో స్కూల్ కు రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించామన్నారు. ఐటీఐ లను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.
Also Read: Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!