Ghaati PM
ఎంటర్‌టైన్మెంట్

Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Director Krish: స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘ఘాటి’ (Ghaati). విక్రమ్ ప్రభు మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర టీమ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది. ఈ కార్యక్రమంలో.. (Ghaati Ready to Release)

పేలే కథ
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంటాయి. ఇప్పుడు నేను రూపొందించిన ‘ఘాటి’ అలాంటి కథే. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడ ఉన్న తీవ్రమైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి నాకు ఈ సినిమాతో ఆస్కారం దొరికింది. చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పినప్పుడు చాలా ఎక్జైట్ అయ్యాను.

Also Read- Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!

అనుష్క విశ్వరూపం చూస్తారు
నేను, స్వీటీ అనుష్క ‘వేదం’ సినిమాలో కలిసి పనిచేశాం. అందులో తను సరోజ పాత్రను పోషించింది. ఇప్పుడు ‘ఘాటి’ సినిమాలో శీలావతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి’.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్‌ను స్వీటీ చేసింది. ఈ సినిమాలో కూడా అద్భుతంగా చేసింది. తను సూపర్ స్టార్ డమ్‌లో వుంది. ‘వేదం’ నుంచి ఇప్పటివరకు ఆమె స్టార్ డమ్‌ అనేక రెట్లు పెరిగింది. తన మనసు మాత్రం అప్పుడెలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ సినిమా కథ చెప్పగానే.. అడ్వంచర్‌తో కూడుకున్న మూవీ తప్పకుండా చేద్దామని చెప్పింది. ఒక్కమాటలో చెప్పాలంటే అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. సెన్సార్‌కి ఇచ్చేముందు ఒకసారి కాపీ మొత్తం చూసుకుని అనుష్కకి ఫోన్ చేశాను. తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఒక ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పా. అదే మాట రేపు ఆడియన్స్ కచ్చితంగా చెప్తారు.

Also Read- OG Film: పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటే? భలే ఆఫర్ పట్టేసిందిగా!

ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్ అతడే కనిపిస్తారు
ఈ కథ రాసుకుంటున్నప్పుడే శీలావతి పాత్రకు అనుష్క మాత్రమే చేయాలని నేను, మా ప్రొడ్యూసర్ రాజీవ్, సాయిబాబా, విక్రమ్, ప్రమోద్, వంశీ డిసైడ్ అయ్యాం. అలాగే దేశిరాజు పాత్రలో విక్రమ్ ప్రభును ఊహించుకునే రాశాను. ఆయన ప్రతి సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర చేస్తారు. ఇందులో కూడా చాలా అద్భుతంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆయనే స్వయంగా తన పాత్రకు తన సొంత వాయిస్‌తో డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే కుందుల నాయుడు పాత్రకి చైతన్య రావు పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్‌లన్నీ అద్భుతంగా ఉంటాయి. జగపతి బాబు క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక సూత్రధారిలాగా ఉంటుంది. మొదటి సన్నివేశం, చివరి సన్నివేశం ఆయనతోనే ఉంటుంది. ఒక మంచి కథకి మంచి నటీనటులు, టెక్నీషియన్స్ దొరకడం అదృష్టం. తోట తరిణి, ఐశ్వర్య, సాయిమాధవ్ బుర్రా, సాగర్ ఇలా అందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ఇప్పటి వరకు తెరపై చూడని కొత్త పాత్రలు ఈ ‘ఘాటి’లో చూస్తారు. చాలా మంచి సినిమా తీశాం.. ఇందులో ఒక అందమైన సోల్ ఉంది. ఆడియన్స్ దానిని మనసులో నింపుకుని వెళ్తారు. సెప్టెంబర్ 5న తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ