Health Department (imagecredit:swetcha)
తెలంగాణ

Health Department: ఆరోగ్య శాఖకు అంటువ్యాధుల పరేషాన్.. ఆ జిల్లాల్లో హై అలర్ట్..?

Health Department: రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు అంటు వ్యాధుల టెన్షన్ మొదలైనది. వరద ప్రభావిత ప్రాంతాల్ల అంటు వ్యాధులు(Infectious diseases) తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఈ దఫా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోగాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని గుర్తించింది. ఈ మేరకు వ్యాధుల వ్యాప్తి చెందే ప్రాంతాలు, వైద్యారోగ్యశాఖ(Health Department) యాక్షన్ ప్లాన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. వాతావరణంలోని మార్పులతో ప్రధానంగా విషజ్వరాలు ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉన్నది. దీంతో వరద ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు(Health Camp) పెట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి మెదక్(Medak), నిజామాబాద్(Nizamabad), ఆదిలాబాద్(Adhilabad), కరీంనగర్(karinagar), ఖమ్మం(khammam), వరంగల్(warangal) జిల్లాల్లోని వరద ఏరియాల్లో క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. రోగాల స్క్రీనింగ్ తో పాటు మెడిసిన్ ను డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) అన్ని విభాగాల హెచ్ వోడీ(HOD)లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముపు ప్రదేశాలు, ఏజెన్సీ ఏరియాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

యాక్షన్ ప్లాన్…

మంత్రి ఆదేశాలతో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ రెడీ అయ్యారు. అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. వరద ఉదృతి తీవ్రంగా ఉన్న ఏరియాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను సిద్ధం చేశారు. దీంతో పాటు పునరావస కేంద్రాల్లో క్యాంపులు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ రెడీ అయింది. ఈ క్యాంపులో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్​, ల్యాట్ టెక్నిషియన్, ఇతర సపోర్టెట్ స్టాఫ్ భాగస్వామ్యం కానున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు, టెస్టింగ్ కిట్లను కూడా క్యాంపుల్లో ఉంచనున్నారు. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో వచ్చినోళ్లకు వెంటనే టెస్టులు నిర్వహించనున్నారు. మొబైల్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన టెంపరరీ ల్యాబ్ లోనే నమునాలు సేకరించి మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల పరీక్షలు నిర్ధారించనున్నారు. మరోవైపు మున్సిపల్ శాఖతో సమన్వయమై ఫాగింగ్, దోమల మందు పిచికారీ వంటివి నిర్వహించనున్నారు. యంటీ లార్వ ఆపరేషన్ కు ఆయిల్ బాల్ లు వేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

Also Read: PM Modi – Trump: 4 సార్లు ఫోన్ చేసిన ట్రంప్.. మాట్లాడబోనన్న ప్రధాని మోదీ!

గర్భిణీలపై ఫోకస్..

వరదలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోన్నది. సేఫ్​గా ఉన్న పంక్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సెంటర్లను నెలకొల్పుతున్నారు. టెంపరరీ విధానంలో ప్రజల ను సేప్టీగా ఉంచేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక గర్భిణుల కోసం ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీలను వినియోగించనున్నారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందే ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. దీంతో పాటు సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంసీహెచ్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ ఫెసిలిటీ సెంటర్లలో వెయిటింగ్ రూమ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 లకు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటాయి.ఆయా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందులను స్టాక్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.మరోవైపు రాష్ట్రంలో వరదలు తగ్గినా, రోగాలు వెంటాడే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు జ్వర సర్వేను కూడా చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.

Also Read: Jani Master: జానీ మాస్టర్‌కు రామ్ చరణ్ ఆపన్న హస్తం.. బన్నీ మాత్రం..

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు