Crops Damage Report (imagecredit:twitter)
తెలంగాణ

Crops Damage Report: రాష్ట్రంలో 270 మండలాలు 2463 గ్రామాల్లో నష్టం.. తేల్చేసిన అధికారులు..?

Crops Damage Report: రాష్ట్రంలో భారీ వర్షాలతో 28 జిల్లాల్లోని 270 మండలాల్లోని 2463 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందుకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టును వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. వరి, పత్తి, మొక్క జొన్న, కంది, పంటలకు తీవ్ర నష్టం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,304 మంది రైతులకు చెందిన 2,20,443 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా77,394 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మెదక్ లో 23169 ఎకరాలు, ఆదిలాబాద్ లో 21276 ఎకరాలు, నిజామాబాద్ లో 18417 ఎకరాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 15317 ఎకరాలు, మంచిర్యాలలో 9568 ఎకరాలు ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో9282 ఎకరాలు, నిర్మల్ లో 9149, సూర్యాపేటలో 8225, సిద్దిపేటలో 7877 ఎకరాలు, సంగారెడ్డిలో 5905ఎకరాలు, వికారాబాద్ లో 2837, నారాయణపేటలో 2814 ఎకరాలు, జోగులాంబ గద్వాల్ లో 1973, పెద్దపల్లిలో 1752 ఎకరాలు, వనపర్తిలో 1439, జయశంకర్ భూపాలపల్లిలో 865, మహబూబ్ నగర్ లో 787, ములుగులో 710, రాజన్న సిరిసిల్లలో 562, నాగర్ కర్నూల్ లో 300, నల్లగొండలో 284, జిగిత్యాలో 254, రంగారెడ్డిలో 95, కరీంనగర్ లో 90, మేడ్చల్ లో 54, జనగాంలో 30, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 ఎకరాలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.

Also Read: Mirai Trailer Out: ‘మిరాయ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా హాలీవుడ్ రేంజ్‌‌‌లో..

వరి పంటకు తీవ్ర నష్టం

రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. లక్షా 9,626 ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పత్తికి 60వేల 36 ఎకరాలు, మిర్చి 194 ఎకరాలు, రెడ్ గ్రాం 6751 ఎకరాలు, జోవర్ 15 ఎకరాలు, శనిగ 116 ఎకరాలు, సోయాబీన్ 20వేల 983 ఎకరాలు, ఇతర పంటలు 639 ఎకరాలు, ఇసుక మేటలో మరో 6వేల 3 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వరిపైరు సైతం కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 44వేల 77 ఎకరాల్లో నష్టం జరిగింది.

Also Read: Tribanadhari Barbarik Review: ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఎలా ఉందంటే..

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు