Sathyaraj-and-Rajini
ఎంటర్‌టైన్మెంట్

Sathyaraj: రజినీకాంత్, సత్యరాజ్‌ల మధ్య వివాదమేంటి? 38 ఏళ్లు రజినీ సినిమాల్లో సత్యరాజ్ ఎందుకు చేయలేదు?

Sathyaraj: సత్యరాజ్.. ఈ పేరు తెలియదేమో గానీ, ‘కట్టప్ప’గా ఆయన అందరికీ పరిచయమే. ఏ నిమిషాన ‘బాహుబలి’ (Bahubali)లో సత్యరాజ్‌ని రాజమౌళి (SS Rajamouli) ఎంచుకున్నాడో గానీ, ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీ నటుడిగా మారారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చే స్థాయికి ఆయన రేంజ్ మారిందంటే.. ప్రస్తుతం ఆయన ఎంత బిజీ నటుడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన నటించిన ‘త్రిబాణాధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik) చిత్రం థియేటర్లలోకి వచ్చే సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అప్పుడెప్పుడో సత్యరాజ్ కెరీర్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

రజినీకాంత్‌తో వివాదం
సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శివాజీ’ సినిమాలో ముందుగా సత్యరాజ్‌ను సుమన్ (Suman) పాత్రకు అనుకున్నారట. కానీ సత్యరాజ్ ఆ పాత్రను చేయనని, అసలు రజినీకాంత్ సినిమాల్లోనే చేయనని చెప్పాడట. ఇవి సత్యరాజ్ 18 ఏళ్ల క్రితం అన్న మాటలు. అంతే.. రజినీకాంత్, సత్యరాజ్ మధ్య ఏదో జరిగిందని, అందుకే ఆయన సినిమాలు చేయనని చెప్పినట్లుగా టాక్ వినబడింది. ఈ విషయంలో అప్పట్లో సత్యరాజ్‌పై భారీగా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆ కారణంతోనే దాదాపు 38 ఏళ్లుగా రజినీకాంత్ సినిమాల్లో సత్యరాజ్ చేయలేదని అనుకుంటూ ఉన్నారు.

Also Read- Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

అసలు విషయమిదే..
ఈ విమర్శలపై సత్యరాజ్ స్పందించాడు. అసలు వాస్తవం ఏమిటనేది ఆయన వివరించారు. ఇప్పుడు వినబడుతున్నట్లుగా నిజంగా నేను చేయను అనలేదు. శివాజీ సినిమా నేను చేయకపోవడానికి కారణం.. అప్పుడు విలన్‌గా చేయడం ఇష్టం లేకే. అదే టైమ్‌లో నాకు హీరోగా అవకాశాలు వస్తున్నాయి. ఆ టైమ్‌లో విలన్‌గా చేస్తే.. ఇక అన్నీ అలాంటి పాత్రలే వస్తాయని భావించి, ఆ సినిమాను రిజిక్ట్ చేశాను. ఇదే అసలు కారణం. ఇది తెలుసుకోకుండా, అప్పట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వార్తలు పుట్టించారు.

Also Read- Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?

38 ఏళ్ల తర్వాత రజినీకాంత్ సినిమాలో
రీసెంట్‌గా వచ్చిన ‘కూలీ’ సినిమాలో రజినీకాంత్ (Rajinikanth) స్నేహితుడిగా సత్యరాజ్ నటించిన విషయం తెలిసిందే. అయితే 38 ఏళ్ల తర్వాత సత్యరాజ్, రజినీకాంత్ సినిమాలో నటించడం విశేషం. ‘మిస్టర్ భరత్’ అనే రజినీకాంత్ సినిమాలో సత్యరాజ్ నటించారు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు ‘కూలీ’ సినిమాతో వారు ఒకే సినిమాలో దర్శనమిచ్చారు. ఇకపై రజినీకాంత్ సినిమాలలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సత్యరాజ్ లేకుండా ఏ సినిమా ఉండటం లేదు. టాలీవుడ్‌లో కూడా ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘హరి హర వీరమల్లు’ సినిమాలోనూ ఆయన ఓ కీలక పాత్రలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?