jogu ramanna
Politics

Jogu Ramanna: ఇదేనా ప్రజా పాలన?

– విత్తనాలు అడిగితే లాఠీఛార్జ్ చేస్తారా?
– ఇదెక్కడి ప్రభుత్వం?
– వెంటనే, విత్తనాలను అందుబాటులో ఉంచాలి
– లేకుంటే, పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతాం
– మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్

Lathi Charge: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి జోగు రామన్న. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం వెళ్తే లాఠీఛార్జ్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 20 వేళ ప్యాకెట్స్ పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచే వాళ్లమని గుర్తు చేశారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడిగిన పత్తి విత్తనాలను ఇవ్వడం లేదని, నోరు తెరిచి అడిగితే లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. వెంటనే, విత్తనాలను అందుబాటులో ఉంచాలని, లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలసి ధర్నా నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్‌ల్లో బిజిగా ఉంటే, ఉప ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. రైతుల సమస్యల పక్కన పెట్టి తెలంగాణ రాజ ముద్రను మార్చే పనిలో ఉండడం కరెక్ట్ కాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతుల పరిస్థితి ఆగమైంది, చెప్పులు, దుస్తులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మార్పు అని అధికారంలోకి వచ్చారు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నించారు. రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అని అడిగారు.

నూతన మద్యం టెండర్ల విషయం తనకు తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పదవులు అనుభవిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యల పక్కన పెట్టి, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సీఎం కుట్ర పన్నుతున్నారని అన్నారు. ట్యాక్స్‌ల పేరుతో వసూలు చేసిన డబ్బులను ఢిల్లీకి పంపిస్తున్నారని, పంట పొలాలు ఎండిపోయి 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రుణమాఫీ పేరుతో పబ్బం గడుపుతూ, రైతు భరోసా ఎప్పటిటి ఇస్తారో తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?