Sikh Man Case
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Sikh man Shot Dead: నడిరోడ్డుపై సిక్కు వ్యక్తిని కాల్చిచంపిన అమెరికా పోలీసులు.. వీడియో ఇదిగో

Sikh man Shot Dead: అమెరికాలో మరో ఘోరమైన ఘటన జరిగింది. నడిరోడ్డుపై 35 ఏళ్ల వయసున్న ఓ సిక్కు వ్యక్తిని లాస్ ఏంజెలెస్ పోలీసులు తుపాకీతో (Sikh man Shot Dead) కాల్చిచంపారు. దాదాపు రెండు అడుగుల పొడవున్న ఖడ్గాన్ని (పెద్ద కత్తి) చేతపట్టుకొని, సిక్కుల సంప్రదాయ యుద్ధకళ అయిన ‘గట్కా’ను రోడ్డుపై ప్రదర్శిస్తుండగా పోలీసులు తుపాకీతో కాల్చారు. దీంతో, గుర్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన జులై 13న డౌన్‌టౌన్ లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టో.కామ్ అరేనా సమీపంలో ఉన్న రద్దీ కూడలిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) తాజాగా విడుదల చేసింది. గుర్‌ప్రీత్ సింగ్‌ ‘గట్కా’ ప్రదర్శన చేయడం, పోలీసులు అతడిని కాల్చిచంపడం వీడియోలో కనిపించింది.

Read Also- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంఛింగ్ డేట్ ఖరారు.. చద‌రంగం కాదు, ర‌ణ‌రంగ‌మే!

కాగా, ఓ అనుమానిత వ్యక్తి.. ఫిగ్యూయొరా స్ట్రీట్, ఒలింపిక్ బులెవార్డ్ వద్ద పెద్ద కత్తితో పాదచారులపై దాడికి ప్రయత్నిస్తున్నాడంటూ, ఎమర్జెన్సీ నంబర్ 911‌‌కు అనేక ఫోన్లు వచ్చాయ లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, గుర్‌ప్రీత్ సింగ్ ఒకానొక సమయంలో పదునైన కత్తితో తన నాలుకను అతిస్వల్పంగా కోసుకున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఇక, ఆయుధాన్ని కిందపడేయాలంటూ పోలీసులు ఎన్నిసార్లు కోరినప్పటికీ, గుర్‌ప్రీత్ సింగ్ పట్టించుకోలేదు.

నిజానికి, కత్తిని కిందపెట్టాలంటూ పోలీసులు చాలాసేపు బతిమాలారు. ఈ క్రమంలో గుర్‌ప్రీత్ సింగ్ తన వాహనం వద్దకు వెళ్లి ఒక నీటి బాటిల్ తీశాడు. దానిని పోలీసులపై విసిరాడు. ఆ తర్వాత కారుని స్టార్ట్ చేసి, కత్తిని విండో నుంచి బయటకు ఊపుతూ వాహనం నడుపుతూ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో, పోలీసులు అతడిని వెంబడించారు. ఈ క్రమంలో గుర్‌ప్రీత్ సింగ్ నియంత్రణ లేకుండా వాహనాన్ని నడిపి ఓ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు.

Read also- AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!

చివరకు ఫిగ్యూయొరా, 12వ స్ట్రీట్ వద్ద తన కారును ఆపి పాదాచారులను భయపెట్టారు. ఆ తర్వాత ఖడ్గంతో పోలీసుల వైపు దూసుకెళ్లాడు. దీంతో, పోలీసులు కాల్పులు జరిపారు. సింగ్‌కి తీవ్రమైన గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పోలీసులు, ఇతర సాధారణ పౌరులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో పాల్గొన్న పోలీసుల పేర్లు మైఖేల్ ఒరోజ్కో, నెస్టర్ ఎస్పినోసా బోజోర్కెస్‌గా గుర్తించారు. ఈ ఘటనపై లాస్‌ఏంజెలెస్ పోలీసులు డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే గురువారం వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియో విడుదలైన తర్వాత పోలీసుల స్పందన, మానసిక ఆరోగ్యంపై అవగాహన, సంప్రదాయ యుద్ధకళలను అభ్యసించే వ్యక్తుల పట్ల పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై అమెరికాలో చర్చలు జరుగుతున్నాయి.

Read Also- Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు