Mowgli Glimpse: పాతికేళ్లు కుర్రాడు ప్రేమ కోసం ఏం చేశాడంటే?
nogli-glimps( imahe :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Mowgli Glimpse: పాతికేళ్లు కూడా నిండని కుర్రాడు ప్రేమ కోసం ఏం చేశాడంటే?

Mowgli Glimpse: సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల ప్రధాన పాత్రలో రూపొందుతున్న ” మోగ్లీ” (Mowgli Glimpse) సినిమా నుంచి గ్లింప్స్ విడుదలయ్యాయి.  ఈ గ్లింప్స్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమా అడవి నేపథ్యంలో రూపొందుతున్న ఒక సమకాలీన ప్రేమకథ. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సందీప్ రాజ్ గతంలో “కలర్ ఫోటో” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాల భైరవ సంగీతం, రామ మారుతి సినిమాటోగ్రఫీ, కొడతి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్‌తో బలమైన సాంకేతిక బృందం పనిచేసింది.

Read also-Team India Jersey: జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ బరిలోకి టీమిండియా!.. ఎందుకంటే?

“మోగ్లీ” ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇది అడవి నేపథ్యంలో సాగే ఒక ఆధునిక ప్రేమకథ. ఇందులో రోషన్ కనకాల ఒక గిరిజన యువకుడి పాత్రలో కనిపిస్తారు. అతను తన స్నేహితురాలిని ఒక దుర్మార్గ అటవీ అధికారి నుండి రక్షించేందుకు పోరాడతాడు. ఈ కథలో ప్రేమ, ఆకర్షణ, అడవిలో జరిగే ఉత్కంఠభరితమైన డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. విడుదలైన గ్లింప్స్‌లో నేచురల్ స్టార్ నాని వాయిస్‌ఓవర్‌తో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పరిచయం ఉంది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Read also-Viral News: ఆన్లైన్ పేమెంట్ తో భర్త గుట్టు మొత్తం బయటకు.. ఉన్న పెళ్లాం పోయే, ఉంచుకున్న సెటప్ పోయే?

ఒక చిన్న ప్రేమకథ చెబుతా అంటూ నేచురల్ స్టార్ నానీ వాయిస్ ఓవర్ తో మోదలవుతోంది ఈ గ్లింప్స్. ‘2025 టెక్నాలజీ ఇంకా పూర్తిగా డవలప్ అవ్వని రోజులు అడవిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్ కూడా వచ్చేది కాదు. అలాంటి టైంలో ఒకడు 30 మందిని తిండి నిద్ర లేకుంగా పరుగెత్తించాడు. గ్యాంగ్ స్టరో స్మగ్లరో కాదు పాతికెళ్లు నిండని ప్రేమికుడు.’ అంటూ సాగుతుంది గ్లింప్స్ నరేషన్. రోషన్ పై తీసిన షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కెమెరా మెన్ తీసిన ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపించింది. కాలభైరవ అందించిన సంగీతం గ్లింప్స్ కు తగ్గట్టుగా ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన బండి సరోజ్ కుమార్ పాత్రకు తగ్గట్టుగా అందులో ఒదిగిపోయారు. హీరో హీరోయిన్ మధ్య షాట్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ గ్లింప్స్ చూస్తుంటే రోషన్ కు మంచి పడేలా అనిపిస్తుంది. నిర్మాతలు కూడా సినిమానుతీయడంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సందీప్ రాజ్ మరోసారి హట్ కొట్టబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. రోషన్ కి ఈ సినిమా ఓ మైలురాయి అవుతుందని సినిమా క్రిటిక్స్ అంటున్నారు.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం