Vishal Engagement: ఎట్టకేలకు విశాల్ (Vishal) పెళ్లికి సంబంధించి ఓ అడుగు ముందుకు పడింది. ఎప్పటి నుంచో విశాల్ పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మధ్యలో చాలా మంది హీరోయిన్లతో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్‌తో విశాల్ ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లి ఆగింది. ఆ తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లతో విశాల్ పెళ్లి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్‌గా విశాల్ తన ప్రేయసి ఎవరో ఇటీవల రివీల్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాలో రజినీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక (Sai Dhanshika)ను పెళ్లాడబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం అధికారికంగా విశాల్ పబ్లిక్ స్టేజ్‌పై ప్రకటించారు. సాయి ధన్సికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నానని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా విశాల్ ఆ వేదికపై ప్రకటించారు.
అనుమానాలే..
విశాల్ నుంచి ప్రకటన అయితే వచ్చింది కానీ, ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే, గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో కూడా ఇలానే విశాల్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నడిఘర్ సంఘం భవనం పూర్తవ్వగానే అందులో జరిగే మొదటి పెళ్లి మాదే అని ప్రకటించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. వరలక్ష్మీ వేరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది, కానీ విశాల్ పెళ్లికి సంబంధించి వార్తలే కానీ, అసలు విషయం ఏంటనేది తెలియలేదు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం విషయంలో కూడా రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సోషల్ మీడియా వేదికగా తెలిపిన విశాల్..
ఇక వీటన్నింటిని జయించి, ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 29న ఈ ఇద్దరి పెళ్లికి అడుగులు పడ్డాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. విశాల్ నిశ్చితార్థానికి (Vishal and Sai Dhanshika Engagement) సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా, ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం మా నిశ్చితార్థం ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా విశాల్ ట్వీట్ చేసి, ఫొటోలను షేర్ చేశారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన వివరాల్ని విశాల్ తెలియజేయనున్నారు. ప్రస్తుతం విశాల్, ధన్సిక నిశ్చితార్థాన్ని పురస్కరించుకుని కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘మకుటం’తో..
రెండు రోజుల క్రితమే ఆయన నటిస్తున్న నూతన చిత్ర ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘మకుటం’ అనే టైటిల్‌తో విశాల్ 35వ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. ‘మకుటం’ మూవీకి రవి అరసు దర్శకుడు. సీ బ్యాక్ డ్రాప్, మాఫియా కథతో విశాల్ సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
