chiru(image:X)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi Fan: అభిమానికి ‘అన్నయ్య’ ఆపన్న హస్తం.. ఇదెలా సాధ్యం సామీ..

Chiranjeevi Fan: ఎవరికైనా సాయం అంటే గుర్తొచ్చే వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటిది తన అభిమానులు అయితే ఏం చేయడానికి అయినా లెక్కచేయరు. తాజాగా ఓ మహిళా అభిమాని ‘చిరంజీవి’ కోసం ఎవరూ చేయని పని చేసింది. తన సొంత ఊరు అయిన ఆదోని నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ వచ్చేసింది. దీనిని చూసిన మెగాస్టార్ ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సాహసం చేసిన మహిళను తన ఇంటికి పిలిపించి తనదైన స్థాయిలో సాయం చేశారు. మెగాస్టార్ కనిపించగానే ఆ మహిళా అభిమాని(Chiranjeevi Fan) ఒక్కసారిగా కన్నీళ్లు తెచ్చుకున్నారు. మెగాస్టార్ ని చూడటమే తాను చేసిన ఈ సాహసానికి ప్రతిఫలం అంటూ తెగ సంబరపడిపోయారు. అనంతరం చిరంజీవి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఆమె పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటానని మాటిచ్చారు. అంతే కాకుంగా వారి చదువుకు అవసరమైన సాయం చేస్తానని తెలిపారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read also-Ganesh Mandapams Hyderabad: హైదరాబాద్ టాప్-7 గణేష్ మండపాలు.. ఇప్పుడు మిస్ అయితే.. ఏడాదంతా బాధపడాల్సిందే!

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన మెగా అభిమానులు మరొక్కసారి మెగాస్టార్ తన మంచి మనసు చాటుకున్నారని అందుకే ఆయన్ని అభిమానించేవారికన్నా ఆరాధించేవారే ఎక్కువ ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సాయాలు మెగాస్టార్ కి వెన్నతో పెట్టిన విద్యని ఇదొక చిన్న సాయం మాత్రమే ఆయన చేసింది చాలా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ ఆపదల్లో ఉన్న వారికి నేనున్నానంటూ అభయ హస్తం అందిస్తారు. ఇప్పటికే తన పుట్టిన రోజు సందర్భంగా కోటి రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. దీనిపై మెగా అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Read also-Chiranjeevi – Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్.. సందీప్ వంగా ఏం ప్లాన్ చేశావయ్యా?

మెగాస్టార్ చిరంజీవి రాబోయే ప్రాజెక్ట్‌లలో వశిష్ట దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న “విశ్వంభర” 2025 సంక్రాంతికి విడుదల కానుంది. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార, వెంకటేష్‌తో కలిసి “మెగా 157” కామెడీ ఎంటర్‌టైనర్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు నిర్మాతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘ఖైదీ’ సీక్వెల్‌గా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రీ-ప్రొడక్షన్‌లో ఉందని సమాచారం. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన మెగాస్టార్, అనిల్ రావిపూడి రాంబోలో రాబోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతికి వస్తున్నారు నుంచి విడుదలైన గ్లింప్ ఇప్పటికే ప్రక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?