Jabardast Comedian ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Jabardast Comedian: జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్న మరో కమెడియన్?

Jabardast Comedian: “జబర్దస్త్” అనేది ఈటీవీలో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు కామెడీ షో. ఇది 2013 ఫిబ్రవరి 7న మొదలైంది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా నిర్మితమవుతుంది. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. ప్రేక్షకులను నవ్వించడం దీని ప్రధాన లక్ష్యం. గతంలో గురు, శుక్రవారాల్లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. 2024 నుంచి షెడ్యూల్ పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు శుక్ర, శనివారాల్లో ప్రసారమవుతోంది. “ఎక్స్‌ట్రా జబర్దస్త్” అనే కొత్త వెర్షన్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు రెండూ “జబర్దస్త్” పేరుతో ఒకే షోగా కొనసాగుతున్నాయి.

Also Read: Mood of Nation Survey: ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి ఎన్ని సీట్లు వస్తాయ్?.. సర్వే విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు భారీ ఆదరణ ఉంది. టీఆర్‌పీ రేటింగ్‌లలో ఎప్పుడూ టాప్‌లో నిలిచింది. అయితే, డబుల్ మీనింగ్ డైలాగులు, అభ్యంతరకర కంటెంట్‌పై విమర్శలు కూడా గట్టిగానే ఎదుర్కొంది. కానీ, ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో ఈ షో ను ఇప్పటికి కూడా రన్ చేస్తున్నారు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. వేణు “బలగం” సినిమాతో దర్శకుడిగా పెద్ద విజయం సాధించాడు, సుధీర్, గెటప్ శ్రీను హీరోలుగా మారారు.

Also Read: TG Rains Effect: దక్షిణ డిస్కం పరిధిలో నేలకూలిన 1,357 విద్యుత్ స్తంభాలు.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ

జబర్దస్త్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్ బాబు కేవలం కామెడీ మాత్రమే కాకుండా పాటలతో కూడా అలరిస్తున్నాడు. అయితే, అతను అక్కడితోనే ఆగిపోకుండా.. డైరెక్షన్ వైపు కూడా వెళ్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇమ్మాన్యూల్ తో ” ప్రేమ వాలంటీర్ ” తో తీసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పాటలను కూడా డైరెక్ట్ చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం

అయితే, ఇటీవలే జబర్దస్త్ బాబు డైరక్షన్లో తెరకెక్కిన సల్లగుండరాదే సాంగ్ కూడా హిట్ అయింది. మరి, ఇంత పాపులర్ అయిన బాబు బిగ్ బాస్ 9 లోకి వెళ్తున్నాడంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు