war-2-ott(image :X)
ఎంటర్‌టైన్మెంట్

War 2 OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈసారి అలా జరగదు..

War 2 OTT: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ నటించిన బిగ్ బడ్జెట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ (War 2 OTT) ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆరో భాగంగా రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం సహా బహుభాషల్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయం సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎందుకంటే థియేటర్ రిలీజ్‌కు నెల రోజుల వ్యవధిలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం.

Read also-Gold Rate Today: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

‘వార్ 2’ స్టోరీ
‘వార్ 2’ సినిమా కథ హృతిక్ రోషన్ పోషించిన మేజర్ కబీర్ ధలివాల్ చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు గౌరవనీయమైన రా ఏజెంట్‌గా ఉన్న కబీర్, ఇప్పుడు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి హత్యలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మారతాడు. అతన్ని అడ్డుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ పోషించిన స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ చలపతి రంగంలోకి దిగుతాడు. కియారా అద్వానీ పోషించిన కావ్య లూథ్రా పాత్ర కథలో ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తుంది. కావ్య తండ్రి, సీనియర్ రా ఆఫీసర్ కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ను కబీర్ హత్య చేయడంతో కథలో ట్విస్ట్‌లు మొదలవుతాయి. ఈ ముగ్గురి మధ్య జరిగే హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హోరాహోరీ ఫైట్‌లు మరియు ఊహించని ట్విస్ట్‌లు సినిమాను ఆసక్తికరంగా మార్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హృతిక్, ఎన్టీఆర్ నటన పోటీపడి మెప్పించిందని, కియారా అద్వానీ అందం నటన సినిమాకు అదనపు ఆకర్షణను తెచ్చాయని రివ్యూలు చెబుతున్నాయి. ఓటీటీ రిలీజ్ వివరాలుసాధారణంగా బాలీవుడ్ చిత్రాలు థియేటర్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే, ‘వార్ 2’ విషయంలో నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం థియేటర్ రిలీజ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే, అంటే సెప్టెంబర్ 12, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ః

Read also-Chiranjeevi – Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్.. సందీప్ వంగా ఏం ప్లాన్ చేశావయ్యా?

థియేటర్ విజయం
‘వార్ 2’ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ మరియు ఎన్టీఆర్, హృతిక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైంది, ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్‌లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ సుమారు 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయల కలెక్షన్‌లను రాబట్టినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 35-40 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 350 కోట్ల షేర్, 700 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను సాధించాల్సి ఉంది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు