Ponguleti Srinivas reddy (imagecredit:twitter)
తెలంగాణ

Ponguleti Srinivas reddy: నష్టపోయిన జిల్లాకు అదనపు నిధులు.. మంత్రి పొంగులేటి!

Ponguleti Srinivas reddy: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ‌ర‌ద ప‌రిస్ధితులు, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. కొద్ది స‌మ‌యంలోనే ముఖ్యంగా మెద‌క్‌(Medak), కామారెడ్డి(kamareddy) ఆదిలాబాద్ జిల్లాల్లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌న్నారు. అయినా కూడా ప్రాణ నష్టం, ఆస్తిన‌ష్టం వీలైనంత మేర‌కు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రె(CM Revanth Reddy)డ్డి సూచ‌న‌ల మేర‌కు బుధ‌వారం మ‌ధ్య‌హ్నం నుంచే ప‌రిస్ధితిని స‌మీక్షించామ‌ని వెల్ల‌డించారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామ‌న్నారు.

నాడు మానేరు వాగు వ‌ర‌ద‌ల్లో

సిరిసిల్ల జిల్లాలోని నర్మల గ్రామం వ‌ద్ద బుధ‌వారం నాడు మానేరు వాగు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ఐదుగురిని హెలికాప్ట‌ర్ ద్వారా ర‌క్షించామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు వారం రోజుల క్రిత‌మే కోటి రూపాయిల చొప్పున నిధులు విడుద‌ల చేశామ‌ని, ప్ర‌స్తుతం అతి భారీ వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న జిల్లాల‌కు అద‌నంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామ‌ని తెలిపారు. కానీ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే.. ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ఎ(BRS)స్ రాజ‌కీయ ల‌బ్దికోసం మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. వారి పాల‌న‌లో వ‌ర‌ద‌లొస్తే గతంలో ఏం చేశారో అందరికీ తెలుసునని వివరించారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరించవద్దని సూచించారు.

Also Read; Attack on Women: మహిళపై విచక్షణారహితంగా దాడి.. చిన్నపాటి విషయాలకే ఘర్షణ

ర‌హ‌దారి సౌక‌ర్యాలు దెబ్బ‌తిన్నాయి

భారీ వ‌ర్షాల‌తో స్ధంభించిన జాతీయ ర‌హ‌దారితోపాటు పంచాయితీరాజ్‌, ఆర్ &బీ(R&B) రోడ్ల‌ను క్లియ‌ర్ చేశామ‌ని, దెబ్బ‌తిన్న రోడ్ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న తాత్కాలికంగా పున‌రుద్ద‌రిస్తున్నామ‌ని తెలిపారు. ప‌లు మండ‌ల కేంద్రాలు, జిల్లా కేంద్రాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యాలు దెబ్బ‌తిన్నాయ‌ని వీటిని వెంట‌నే పున‌రుద్ద‌రించేలా ఆదేశించామ‌న్నారు. జిల్లాల్లో రెవెన్యూ. పోలీసు యంత్రాంగం చిత్త‌శుద్దితో 24/7 ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. గురువారం విప‌త్తుల నిర్వ‌హ‌ణా శాఖ అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. అలాగే మెద‌క్(Medak) కామారెడ్డి(kamareddy) సిరిసిల్ల(Siricilla) నిర్మ‌ల్(nirmal) జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిట‌రింగ్ చేసుకోవాల‌ని సూచించారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం పట్టిన త‌ర్వాత న‌ష్టాన్ని అంచ‌నా వేయాల‌ని సూచించారు. వ‌ర్షాల‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను అన్నివిధాలా ఆదుకుంటామ‌ని తెలిపారు. రాష్ట్రంలో వ‌ర్ష బీభ‌త్సం దృష్ట్యా ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ప‌ని చేస్తున్నాయ‌ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి హెలికాప్ట‌ర్‌ల ద్వారా బాధితుల‌ను ఆదుకోవ‌డానికి సిద్ధం చేశామ‌ని వివ‌రించారు. కూలి పోయిన ఇండ్లు, న‌ష్ట‌పోయిన రైతులను ఆదుకుంటామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

Also Read: PCC Chief Mahesh Kumar Goud: 12 ఏళ్ల బీజేపీ పాలనపై చర్చకు వస్తావా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ సవాల్!

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం