Tribanadhari Barbarik: ఈ శుక్రవారం రాబోయే చిత్రాలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). ప్రేక్షకులంతా ఈ సినిమా మరో ‘కార్తికేయ2’, ‘కల్కీ’ తరహాలో ఉంటుందని అంచాలను వేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో, అలాగే చిత్ర ప్రధాన తారాగణం ఇస్తున్న ఇంటర్వ్యూలలో.. సినిమా వాస్తవ రూపం ఇదని చెబుతున్నారు. సినిమాలో బార్బరిక్ నేపథ్యం ఉంటుంది కానీ, సినిమా నడిచే క్రమం మాత్రం ప్రస్తుతం సమాజం, అందులోని సంఘటనలతోనే థ్రిల్లింగ్‌గా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉంటుందని చెబుతూ వస్తున్నారు. సత్య రాజ్ (Sathya Raj), వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను (Udaya Bhanu), సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
Also Read- Chiranjeevi vs Prabhas: చిరంజీవికి పోటీగా ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ఆసక్తికర పోరు!
చిరు బర్త్‌డేకి రావాల్సిన సినిమా
వాస్తవానికి ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్ట్ 22న విడుదల కావాలి. మేకర్స్ కూడా మీడియా సమావేశం నిర్వహించి, మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకి ఈ సినిమా ట్రీట్ అని వ్యక్తం చేశారు. కానీ చివరి నిమిషంలో మరో వారానికి వాయిదా పడి.. ఫైనల్‌గా ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
పెయిడ్ ప్రివ్యూస్
ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో.. సినిమా విడుదలకు ముందే మేకర్స్ పెయిట్ ప్రివ్యూస్ నిర్వహించారు. వరంగల్, విజయవాడ వంటి ప్రదేశాల్లో ప్రదర్శించిన ప్రివ్యూస్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా. సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. సినిమా చూసిన వారంతా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా అని, ఇందులో ఒక జీవితం దాగి ఉందని చెప్పడం విశేషం. అలాగే సత్యరాజ్ పాత్రపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read- SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే?
సెన్సార్ పూర్తి (Tribanadhari Barbarik Censor Details)
‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, యూఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులు.. కంటెంట్‌తో పాటు, మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఉందని ప్రశంసించినట్లుగా మేకర్స్ తెలియజేశారు. మూవీ టీమ్ కూడా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూ ఇప్పటికే ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న భారీ ఎత్తున థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. ఫైనల్‌గా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు