Brs KTR (imagecredit:swetcha)
తెలంగాణ

Brs KTR: భారీ వర్షాలతో కేటీఆర్ కీలక సూచనలు.. ఇదే మనకు అసలైన సమయం అంటూ..?

Brs KTR: భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు((MLAs), ఎమ్మెల్సీలు(MLC), ఎంపీలు(MP), మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతో కేటీఆర్ మాట్లాడారు.

ముందస్తు ప్రణాళికలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక రకాలైన సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టేవాళ్ళమని అన్నారు. వరదల సమయంలో NDRF, SDRF విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసేవాళ్ళమని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు, ఈ ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకువచ్చే వరకు కూడా పెద్దగా  ఎలాంటి స్పందించడం లేదని అన్నారు. ప్రజల వెంట నిలబడే పార్టీ బీఆర్ ఎస్ మనది కాబట్టి, కార్యకర్తలు ప్రజల కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలని అన్నారు.

Also Read: Trolls on South Film Industry: సౌత్ హీరోలపై సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. వారికి అంత గర్వం పనికిరాదు!

బురద నిండిన ప్రాంతాల్లో

కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలని, తీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అక్కడి ప్రజలకు అందించాలని అన్నారు. బురద నిండిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. మనం చేసే ప్రతి సహాయకార్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడిచేసేలా ఉండాలని కేటీఆర్ అన్నారు.

Also Read: Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో కుంభవృష్టి.. వరదల్లో 9 మంది మృతి

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!