mirai( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Mirai Trailer Out: ‘మిరాయ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా హాలీవుడ్ రేంజ్‌‌‌లో..

Mirai Trailer Out: తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “మిరాయ్” సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్(Mirai Trailer Out) ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ “సూపర్ యోధుడు”గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తేజ సజ్జ స్టైల్, మాస్ ఎంట్రీ కలిసి ప్రేక్షకుల్లో భారీ హైప్ సృష్టించాయి. ఈ చిత్రంలోని తొలి పాట “వైబ్ ఉంది బేబీ” ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీ హక్కులు తీసుకోవడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 12, 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, విజువల్స్, సూపర్ హీరో థీమ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Read akso-Singer Suchitra: ఈ వయసులో గాయనికి కాబోయే భర్త ఏం చేశాడంటే?.. మరీ అంత దారుణమా!

ఇంతకు ముందు నటించిన “హనుమాన్” సూపర్‌హీరో సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఒక తెలుగు సూపర్ హీరో సినిమా వంద కోట్లకు పైనే వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించారు. హీరోగా తేజ సజ్జ, హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించారు. కథ పూర్తిగా భారతీయ సంస్కృతి, పురాణాల నేపథ్యంతో సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను కలిపి చూపించబడింది. సెట్‌యింగ్ చిన్న ఊరు అంజనాద్రిలో ఉంటుంది, అక్కడ జరిగే సంఘటనలు, హీరోకు లభించిన శక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, హీరో క్యారెక్టర్ డిజైన్ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.

Read also-Actor Madhavan: భారీ వర్షాల ఎఫెక్ట్.. లద్దాఖ్‌లో చిక్కుకుపోయిన మాధవన్.. ఎటూ కదల్లేని స్థితిలో..

‘మిరాయ్’ ట్రైలర్ చూస్తుంటే.. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతుంది. అంటూ మెదలవుతోంది. అంటే కొన్ని గ్రంధాలను కాపాడటానికి తెజ సజ్జా తనకు తెలియకుండానే నియమించబడతాడు. వాటికి కాపాడటానికి పక్కవారితో ప్రేరేపించబడతాడు. మంచు మనోజ్ విలన్ గా బాగా సెట్ అయ్యారు. ‘నా ప్రస్తుతం ఊహాతీతం’ అన్న డైలాగ్ కు థియేటర్లు అదిరిపోయేలా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ఎక్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ ను తలదన్నేలా ఉన్నాయి. జగపతి బాబు, శ్రేయ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే తెజ ఈ సారి రూ.500 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు విజువల్ వండర్ ఇవ్వనుంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు