Draupathi 2: చోళ చక్రవర్తి అసోసియేషన్‌లో నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపతి -2’ (Draupathi 2). 2020లో వచ్చిన ‘ద్రౌపతి’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇంతకు ముందు ‘పళయ వన్నారపేట్టై, ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్. జి ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- CPM Leader John Wesley: యూరియా కొరతపై బీజేపీ తప్పుడు ప్రచారం.. సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు!
ఈ పోస్టర్ హీరో లుక్‌ని పరిచయం చేస్తుంది. ఇందులో రాయల్ లుక్‌లో రాజసం ఉట్టిపడేలా హీరో కనిపిస్తున్నారు. ఇది 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారని చరిత్ర చెబుతోంది. రక్తంతో రాసిన చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో దాదాపు 75 శాతాన్ని ముంబైలో.. మిగిలిన షూటింగ్‌ను సెంజి, తిరువణ్ణామలై, కేరళలలో చిత్రీకరించనున్నామని మేకర్స్ తెలుపుతున్నారు.
Also Read- They Call Him OG: ఫైర్ స్ట్రోమ్ తర్వాత ఇలాంటి సాంగ్‌ని అసలు ఊహించలేదు.. హార్ట్ టచింగ్!
ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ‘ద్రౌపతి’ సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సీక్వెల్ ద్వారా ఈ చిత్రం ద్రౌపతి సిరీస్‌లో రెండవ భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు మోహన్.జి, పద్మ చంద్రశేఖర్ డైలాగ్స్ అందిస్తున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, ఫిలిప్ ఆర్.సుందర్ సినిమాటోగ్రఫీ, థనికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, దేవరాజ్ ఎడిటింగ్, కమలనాథన్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను, టీజర్ విడుదల వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు