Tribanadhari Barbarik
ఎంటర్‌టైన్మెంట్

Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్బరిక్’ ఎందుకు చూడాలంటే..

Tribanadhari Barbarik: వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఆగస్ట్ 29న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను నటుడు వశిష్ట ఎన్ సింహా మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రయాణం ఎలా మొదలైందంటే.. ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ వల్ల మోహన్ నాకు ఈ కథను వినిపించారు. ఏవమ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు మోహన్, నరేంద్ర ఈ పాయింట్‌ను చెప్పారు. సోషియో, థ్రిల్లర్ అని చెప్పి ఈ టైటిల్‌ను చెప్పారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర గురించి బయట చాలా మందికి తెలియదు. టైటిల్ చెప్పిన వెంటనే కథను వినాలని అనిపించింది. స్టోరీ విన్నదానికంటే కూడా సినిమా విజువల్‌గా అద్భుతంగా వచ్చింది. ఇందులో కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నన్ను నెగెటివ్ రోల్స్‌లో చూశారు. కానీ ఇందులో నా కారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నా పాత్ర ఉంటాయి. ఇందులోని స్క్రీన్‌ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది.

Also Read- PCC Chief Mahesh Kumar Goud: 12 ఏళ్ల బీజేపీ పాలనపై చర్చకు వస్తావా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ సవాల్!

ఇందులో మిడిల్ క్లాస్‌కు చెందిన ఓ అబ్బాయి పాత్రను పోషించాను. పెద్ద కలలతో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? అన్నది చాలా బాగా చూపించారు. బార్బరిక్ కథలో నా ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు బార్బరికుడి థీమ్‌కు లింక్ ఉండటం అందరినీ కనెక్ట్ చేస్తుంది. త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని మాత్రమే చూస్తారు. జవాబుదారితనం, బాధ్యతల గురించి ఈ చిత్రంలో చర్చించారు. ఇందులోని ప్రతీ పాత్రకు చాలా డెప్త్, ఇంపార్టెన్స్ ఉంటుంది. సత్య రాజ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, నా పాత్ర, సాంచీ రాయ్ ఇలా అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. సత్య రాజ్ ఇప్పటికే 170కి పైగా సినిమాలు చేశారు. శ్యామ్ కతు అనే పాత్రలో ఆయన చాలా అద్భుతంగా నటించారు. మనకి కూడా ఇలాంటి ఓ తాత ఉంటే బాగుండేది అని సినిమా చూసేవారందరికీ అనిపిస్తుంది. ఉదయ భాను చాలా ఏళ్ల తర్వాత ఓ శక్తివంతమైన పాత్రను పోషించారు.

మైథలాజికల్ పాత్రలతో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఇదొక ట్రెండ్‌లా మారింది. ఇప్పుడు మేం ‘బార్బరిక్’ పాత్రతో వచ్చాం. ఇలాంటి మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇంకా వస్తే చాలా బాగుంటుంది. వీరందరి గొప్పతనం గురించి మన ముందు తరాలు తెలుసుకోవాలి. అయితే మా మూవీ పూర్తిగా మైథలాజికల్ జానర్‌లో ఉండదు. బార్బరికుడు, అతని శక్తిని ఈ తరానికి మేం చెప్పే ప్రయత్నం చేశామంతే. బార్బరికుడు చుట్టూ కథను రాసుకోలేదు. బార్బరికుడు థీమ్‌ను మాత్రమే తీసుకుని కథను అల్లుకున్నారు. ఇది నార్త్, సౌత్ అని కాకుండా ప్రతీ మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా బార్బరిక్ సినిమా ఉంటుంది.

Also Read- Alia Bhatt: మా వీడియోలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఆలియా భట్‌‌ ఫైర్

ఈ సినిమా షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది. చాలా వరకు నైట్ షూట్స్, రెయిన్ షాట్సే ఉంటాయి. ఈ క్రమంలో దర్శకుడు, కెమెరామెన్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఏదీ మిస్ అయ్యేవారు కాదు. అలా చాలా సార్లు ఎన్నో టేక్స్ చేసేవాళ్లం. ఈ సమాజంలో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే.. వాటికి సమాధానాలు దొరకవు. కానీ మా బార్బరిక్ మూవీ వాటికి సమాధానాలు కూడా చెబుతుంది. ఓ మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్‌ని ఎక్కడా నిరాశ పరచదని కచ్చితంగా చెప్పగలను. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. అందరూ కచ్చితంగా ఒక గొప్ప సినిమా చూశామనే ఫీల్‌ని పొందుతారు’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!