Tanikella Bharani: రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా.. రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’ (Mutton Soup). ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను ఇటీవల సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మంగళవారం (ఆగస్ట్ 26) ‘మటన్ సూప్’ నుంచి ‘హర హర శంకర’ సాంగ్‌ను సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు.
Also Read- Sachin on Joe Root: సచిన్ రికార్డ్ చెరిపివేసే దిశగా జో రూట్.. తొలిసారి స్పందించిన సచిన్ టెండూల్కర్
పాట విడుదల అనంతరం తనికెళ్ల భరణి (Tanikella Bharani) మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రోజురోజుకి కొత్త రక్తం వస్తోంది. దాదాపు నలభై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు బాగా తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలని కోరుకుంటున్నాను. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చాలా చక్కగా చూపించారు. ‘మటన్ సూప్’ టీమ్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ మూవీ బ్రహ్మాండమైన విజయం సాధించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. మా ‘మటన్ సూప్’ చిత్రంలోని ‘హర హర శంకర’ పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి సార్‌కు ధన్యవాదాలు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపలకు థాంక్స్. నన్ను ముందుండి నడిపిస్తున్న మా పర్వతనేని రాంబాబుకు ధన్యవాదాలు. అడిగిన వెంటనే సాయం చేసిన శివకు థాంక్స్. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేదుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Also Read- Kajal Aggarwal: మహేష్ బాబు, కాజల్ ను అంతలా టార్చర్ చేశాడా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
తనికెళ్ల భరణి ఈ పాటను లాంచ్ చేయడానికి రావడం చూస్తుంటే.. మాకు స్వయంగా ఆ శివుడే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడే మేం విజయం సాధించినట్టుగా అనిపిస్తోందని అన్నారు నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్). ఇంకా నిర్మాతలు అరుణ్ చంద్ర, రామకృష్ణ సనపల మాట్లాడుతూ.. పాటను విడుదల చేసిన తనికెళ్ల భరణికి ధన్యవాదాలు తెలుపుతూ.. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరారు. ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు