Mother kills daughter: మానవ సంబంధాలు నానాటికీ బలహీనంగా మారిపోతున్నాయి. సొంతవారినే అతి దారుణంగా కడ తేరుస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే తెలంగాణలోనూ దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన బిడ్డను దారుణంగా హత్య చేసింది. ఆపై తాను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. అయితే ఆ తల్లి అలా ఎందుకు చేసిందన్న దానికి గల కారణం తెలిసి స్థానికులు షాకవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
మహబూబ్ నగర్ జిల్లా కొత్త గంజ్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. యశోద అనే మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్ క్యాంపు ఆఫీసు సమీపంలో జీవిస్తోంది. ఎంతో హాయిగా సాగిపోతున్న యశోద జీవితాన్ని ఓ రోజు కీలక మలుపు తిప్పింది. ఆ రోజు ఇంటి బయట పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధి కుక్కలు అక్కడకు వచ్చి వాటిని ఎంగిలి చేసినట్లు సమాచారం. తెలియకుండా వాటిని యశోద వంటల్లో ఉపయోగించింది. అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు మెుదలైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read: AA22XA6: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హాలీవుడ్ రేంజ్‌లో కొత్త సినిమా!
బోర్డుపై దాని గురించి రాసి..
రాబిస్ వ్యాధి సోకుతుందన్న భయంతో మానసికంగా ఆమె కుంగిపోయిందని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లిన అనంతరం యశోద తన కూతుర్ని చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. కొడుకును ఆస్పత్రిలో చూపించమని బోర్డు మీద రాసి ఆమె ఉరి వేసుకుంది. యశోద ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానించి లోపలికి వెళ్లిచూడగా.. ఆమె ఊరివేసుకొని వేలాడుతూ కనిపించింది.
Also Read: Viral Video: హైదరాబాద్ కంటే.. న్యూయార్క్‌లో బతకడం చాలా ఈజీ.. నిరూపించిన ఇండియన్!
భర్త నరేష్ ఏమన్నారంటే?
తన భార్య యశోద కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని భర్త నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రేబిస్ సోకలేదని ఎంత చెప్పిన ఆమె వినిపించుకోలేదని.. యూట్యూబ్ లో రేబిస్ గురించి తెగ వేతికేదని అన్నారు. ఆమెకున్న అనారోగ్య లక్షణాలు రేబిస్ కు సంబంధించినవి కాదని యశోద తండ్రి సైతం పలుమార్లు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. అనుమానంతో రేబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుందని భర్త నరేష్ తెలిపారు. చివరకూ తనను కూడా రేబిస్ గురించి నాటు వైద్యం చేయించుకోవాలని సూచించిందని సరే అని చెప్పి మందులు కూడా తెచ్చుకున్నానని నరేష్ అన్నారు. చివరికి తనతో పాటు కన్న కూతుర్ని తీసుకెళ్లిపోవడంపై నరేష్ తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.