Minister Komatireddy (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Komatireddy: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు 100 కోట్లు రిలీజ్: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy: ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్ ప్రపోజల్స్ రూపొందించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ కార్యాలయంలో శాఖపై సుధీర్ఘంగా సమీక్షించారు. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన వెనుక బడిన జిల్లాలకు హ్యామ్ లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల కోసం కొత్తగా భూ సేకరణ అవసరం లేదు కాబట్టి అదనపు భారం ఏమి ఉండదని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉన్న రోడ్ల కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. హ్యామ్ ప్రపోజల్స్ లో 10కి.మీ పైగా ఉన్న రోడ్లను తీసుకోవాలని.. కనెక్టివిటీ కారిడార్ ను డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలని సూచించారు.

4వేల కి.మీ రోడ్లు రెన్యువల్

దీంతో రూరల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ యాక్టివిటీ(Telangana Socio Economic Activity) పెరుగుతుందన్నారు. హ్యామ్ లో సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్.. డబుల్ లేన్ నుండి పీవుడ్ షోల్డర్స్ (10 మీటర్ల) రోడ్డు..ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఫోర్ లేన్ రోడ్స్ కొన్ని హ్యామ్ లో తీసుకుంటామన్నారు. దాదాపుగా 4వేల కి.మీ రోడ్లు రెన్యువల్ చేస్తామన్నారు. కొత్త ఇన్ఫ్రా పెంచడంతో పాటు పాత రోడ్ల మెయింటెనెన్స్,బలోపేతం చేస్తామని వివరించారు. అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా 100కోట్లు రిలీజ్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి నీ కోరుతానని చెప్పారు. ఫీల్డ్ నుంచి పూర్తి వివరాలు తెప్పించాలని సీఈ మోహన్ నాయక్ ను ఆదేశించారు.

Also Read: Farmers Protest: రైతులను వేధిస్తున్న యూరియా కొరత.. కారేపల్లిలో రోడ్డెక్కిన అన్నదాతలు

ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ

వచ్చే రెండు సంవత్సరాలలో హైకోర్టు(High Court), ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital), ప్రధాన బిల్డింగ్స్ అన్ని పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నార్త్ పార్ట్ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలనీ అధికారులను ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో మరొకసారి భేటీ అవుతామని మంత్రిస్పష్టం చేశారు. ఈ సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Verlapaly Shanjr), దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ సీఈ లు జయ భారతి, మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ అన్ని జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లు పాల్గొన్నారు.

Also Read: Min Seethakka: ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి సీతక్క

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?