BC Commission
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Commission: డిపార్ట్‌మెంట్లపై బీసీ కమిషన్ అసంతృప్తి?

BC Commission: శాఖల వారీగా వివరాలను కోరినా ఇవ్వని ఆఫీసర్లు

ఆరు నెలల కిందటే సెక్రటరీలకు లేఖ
‌‌సామాజిక న్యాయంపై కమిషన్ స్టడీ
తాజాగా మరోసారి రివ్యూ
కొంతమంది సెక్రటరీలు డుమ్మా
హాట్ టాపిక్‌గా మారిన కార్యదర్శుల వ్యవహారం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ శాఖలపై బీసీ కమిషన్ (BC Commission) అసంతృప్తిని వ్యక్తం చేసింది. శాఖల వారీగా వివరాలను కోరినా, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో బీసీలు ఎంత మంది ఉన్నారు?, ఏయే కేడర్లలో ఉన్నారు?, బీసీ ఉప కులాలతో సహా డేటా ఇవ్వాలని ఆరు నెలల కిందటే కమిషన్ అన్ని డిపార్ట్‌మెంట్ల సెక్రటరీలకు లేఖ రాసింది. అడిషనల్ సెక్రటరీలతో సమీక్ష కూడా నిర్వహించింది. కానీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వివరాలు అందలేదని కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొన్ని శాఖలు అసంపూర్తిగా వివరాలు ఇవ్వగా, మరికొన్ని శాఖల నుంచి వివరాలేవీ అందలేదు. ఇది కమిషన్ ఆగ్రహానికి కారణమైంది. సీరియస్ అంశాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారని? కమిషన్ ప్రశ్నించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ శాఖల సెక్రటరీలతో బీసీ కమిషన్ ప్రత్యేక రివ్యూ నిర్వహించింది. వివరాలపై ప్రశ్​నించింది. బీసీ అంశం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ ఆఫీసర్ల నుంచి సపోర్టు లేకపోతే ఎలా అని కమిషన్ నిలదీసింది. ఇక ఈ కీలక మీటింగ్ కు కొంత మంది సెక్రటరీలు డుమ్మా కొట్టారు. వాళ్లపై కూడా కమిషన్ సీరియస్ అయింది. బీసీ కమిషన్ చట్ట బద్ధమైన సంస్థ అని, రివ్యూ నిర్వహిస్తే ఐఏఎస్ ఆఫీసర్లు హాజరు కారా? అని కమిషన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. డుమ్మా కొట్టిన కార్యదర్శుల నుంచి వివరణ కూడా కోరింది. ఐఏఎస్ లపై బీసీ కమిషన్ ఆగ్రహంతో ప్రభుత్వంలో హట్ టాపిక్ గా మారింది. తాము అడిగిన విరాలను సెప్టెంబరు 15 లోపు సబ్మిట్ చేయాలని కమిషన్ మరోసారి ఆదేశాలిచ్చింది.

Read also- Gold Coins Scam: పురాతన బంగారు నాణేలు ఉన్నాయని.. నిలువునా ముంచారు

సామాజిక న్యాయం పై స్టడీ..??
కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక కుల, ఆర్ధిక, సామాజిక సర్వే నిర్వహించి రిపోర్టు తయారుచేశారు. అయితే అందులో గవర్నమెంట్ ఉద్యోగుల్లో కొందరు సర్వే మిస్ చేయగా, మరి కొందరు సరైన ఆప్షన్స్ ఇవ్వలేదని కమిషన్ భావిస్తున్నది. కొందరు ప్రభుత్వ ఉద్యోగి అని మెన్షన్ చేసి ఆ తర్వాత మిగతా వివరాలేవి పొందుపరచలేదని సమాచారం. ఇక క్యాస్ట్ విషయంలోనూ కొందరు ఆప్షన్స్ ఇవ్వలేదట. దీంతోనే కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల స్పష్టమైన వివరాలు ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చింది. హోదా, కులం, ఉప కులం వంటివి తప్పనిసరిగా ఉండాలని కమిషన్ సూచించింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమా చారం లభిస్తే సామాజిక న్యాయంపై బీసీ కమిషన్ స్టడీ చేయనున్నది.ఇక ప్రస్తుతం బీసీ ల్లో 130 కులాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కులాలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగస్వామ్యం లభించింది. చాలా ఉప కులాల్లో ఇప్పటి వరకు ప్రతినిథ్యం లభించలేదు. దీంతో ఇప్పటి వరకు ఉద్యోగాలు పొందినోళ్లలో ఏయే కులాల నుంచి ఎంత మంది ఉన్నారు? అనే లెక్కలను కమిషన్ సేకరించనున్నది. అవకాశాలు ఎక్కువ ఎవరికి వచ్చాయి? ఇంకా ఎవరికి చేయాల్సి ఉంటుంది? అనే అంశాలపై స్టడీ చేసి ప్రత్యేక రిపోర్టు తయారు చేయనున్నారు. అంతేగాక కొన్ని కోర్టుల్లో కులాలపై కేసులు కూడా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు లీగల్ పరంగా ఎలా ముందుకు సాగాలంటే ఈ లెక్కలు అవసరమని కమిషన్ చెప్తున్నది.

Read Also- Mysore Crime incident: ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చేసిన ప్రియుడు.. అలా ఎందుకు చేశాడంటే?

బీసీల డెవలప్ కు ఉపయోగం..జి. నిరంజన్ బీసీ కమిషన్ చైర్మన్
“రాష్ట్ర బీసీ కమిషన్‌ ఒక చట్టబద్ధమైన సంస్థ. బీసీల రిజర్వేషన్‌ అమలు విధానంపై పర్యవేక్షించడానికి ఏవైనా లోటుపాట్లపై ఫిర్యాదులు వస్తే విచారించి, పరిష్కరించడానికి నియమించబడింది. బీసీ కమిషన్‌ సేకరించిన వివరాల ఆధారంగా బీసీల సామాజిక, విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి వీలైంది. బీసీ కమిషన్‌ 2024వ సంవత్సరం నవంబర్‌, డిసెంబర్‌లలో 10 ఉమ్మడి జిల్లాలలో పర్యటించినప్పుడు చిన్న చిన్న కులాల వారి నుండి తమకు ఎటువంటి అవకాశాలు లభించడం లేదని కమిషన్‌ ముందు ఆవేదన తెలిపారు. బీసీ కులాల్లోని కొన్ని పెద్ద కులాల వారే లాభాలు పొందుతున్నారని, బీసీ రిజర్వేషన్లు, బీసీల జాబితాను తిరిగి పునర్వర్గీకరణ చేయాలని కోరారు. దీంతోనే అన్ని విభాగాల ఉద్యోగుల వివరాలను కోరాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా కులాల భాగస్వామ్యం ఎలా ఉన్నదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
మరోవైపు రాష్ట్రంలో కొన్ని బీసీ కులాలకు సంబంధించిన అంశాలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. వాటన్నింటినీ విచారించి, తన అభిప్రాయాన్ని నివేదించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. బీసీ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణం చేసేందుకు డేటా కలెక్షన్ జరుగుతున్నది”.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు