Farmers Protest: నకిలీ ఎరువులు తీసుకొని కలెక్టరేట్‌కు రైతులు
Fake Fertilisers
Telangana News, లేటెస్ట్ న్యూస్

Farmers Protest: నకిలీ ఎరువులు తీసుకొని కలెక్టరేట్‌కు వెళ్లిన రైతులు

Farmers Protest: నకిలీ ఎరువులు అమ్మకం…!

నాగార్జున ఫర్టిలైజర్ నిర్వాకం
కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన

నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: నాగర్ కర్నూల్‌లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారస్తులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలావుంచితే, తాజాగా నకిలీ ఎరువులను కూడా విక్రయించడం నాగర్ కర్నూల్‌లో రైతులను ఆగ్రహానికి గురిచేసింది. తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు జిల్లా కేంద్రంలో ఉన్న నాగార్జున ఫర్టిలైజర్స్ దుకాణంలో ఇటీవల 28- 28 ఎరువుల సంచులు కొనుగోలు చేశారు. తీరా జమిస్తాపూర్‌లోని తమ పొలాల వద్దకు వెళ్లి సంచులను విప్పి చూడగా, అవి కల్తీవని గుర్తించి ఆందోళనకు (Farmers Protest) గురయ్యారు.

Read Also- Hanumakoda District: వినాయక చవితి నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కీలక సూచన

గ్రామంలో అదే షాపులో ఎరువులు కొన్న రైతులు తాము మోసపోయామని గుర్తించి ఆటోలో నకిలీ ఎరువుల సంచులతో జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ నిర్వాహకులు సెటిల్మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు చేశారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం, అధికారులు స్పందించి నాగార్జున ఫెర్టిలైజర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ఫర్టిలైజర్ దుకాణానికి అధిక ధరలకు ఎరువుల విక్రయం చేపడుతున్నారన్న ఫిర్యాదులపై జిల్లా అధికారులు నోటీసులు సైతం జారీ చేశారు. అయినప్పటికీ ఫర్టిలైజర్స్ నిర్వాహకులు తీరు మార్చుకోకపోవడం గమనార్హం.

Read Also- Viral Video: 25 ఏళ్ల యువతిని వేధించిన ఏడేళ్ల బాలుడు.. విలపిస్తూ వీడియో పెట్టిన బాధితురాలు!

బూర్గంపాడులో యూరియా కొరత లేదంటున్న అధికారులు

బూర్గంపహాడ్, స్వేచ్ఛ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరపున నాలుగు ఎరువుల దుకాణాలు ఉన్నాయని, మండలంలో ఎలాంటి ఎరువులు కొరత లేదని సీఈవో బివి ప్రసాద్ తెలిపారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు 40 లారీల యూరియా సరఫరా చేస్తే ఈ ఏడాది ఇప్పటికే 60 లారీల యూరియా రైతులకు సరఫరా చేశామని ఆయన వివరించారు. ఇంకా 10 లారీల యూరియా దిగుమతి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రైతులకు మరిన్ని ఎరువులు అందించేందుకు సోమవారం నూతన ఎరువుల దుకాణాన్ని నాగినేనిప్రోలు-రెడ్డిపాలెంలో ప్రారంభించామని, రైతన్నలకు ఇది ఒక మంచి శుభపరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు. రైతన్నలు యూరియాపై ఎటువంటి అపోహలు నమ్మవద్దని, రైతులకు కావాల్సిన నిల్వలు ఉన్నాయని బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సీఈవో బివి ప్రసాద్ రైతులకు తెలిపారు.

Read Also- The Paradise Film: సినిమా ప్రమోషన్స్ ఇలా కూడా చేస్తారా.. ఇదెక్కడా చూడలా..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..