Vijayashanti fired on bjp
Politics

సోనియా వస్తే తప్పేంటి?

Vijayashanthi fired on bjp leader kishan reddy the issue of soniagandhi arriving Telangana:
రాష్ట్రావతరణ దినోత్సవానికి సోనియాగాంధీని ఆహ్వానిస్తే తప్పేమిటని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రశ్నించారు. దీనిపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాగాంధీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అసలు ప్రశ్నించే అర్హత బీజేపీ ఎంత మాత్రం లేదని విజయశాంతి బీజేపీ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఖండించారు. ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అంటూ ప్రకటించి బీజేపీ మాట తప్పారన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోక ఆనాడు గాలికి వదిలిపెట్టారన్నారు. నాడు యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒప్పించి కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ చేసిన త్యాగం ఎవరూ మరవరని అన్నారు. తెలంగాణ రాకను తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి తీరుతారని స్పష్టం చేశారు.

సోనియాకు ఆ అర్హత ఉంది

సోనియా గాంధీ గారు, రేపటి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంకు ఎట్ల హాజరు అవుతారు అని బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అడిగితే, ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నదని కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగి తీరుతారని పేర్కొన్నారు. గౌరవనీయ కిషన్ రెడ్డి గారు.. సోనియాగాంధీ గారికి ఆ అర్హత సంపూర్ణంగా ఉంది. కానీ అడిగే అర్హత బీజేపీకి నిజానికి నిజాయితీగా ఐతే లేదన్నది కాదనలేని వాస్తవం అని విజయశాంతి తేల్చి చెప్పారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?