Min Seethakka (imagecredit:swecha)
తెలంగాణ

Min Seethakka: ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి సీతక్క

Min Seethakka: ఉపాధ్యాయ సమస్యలను సీఎం(CM) దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Min Seethakka) హామీ ఇచ్చారు. హైదరాబాద్(Hyderabad) లోని ఆబిడ్స్ స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(State Teachers Union Telangana State) రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ అభివృద్ధిలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించిందన్నారు.

చాడ వెంకట్ రెడ్డి

పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లులను ప్రభుత్వం దశల వారీగా క్లియర్ చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం(MLC Professor Kodandaram) మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎస్టీయూ పాత్రను గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంక్షేమానికి పర్వత్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. సీపీఐ(CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి(Chada Venkat Reddy) మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే ఏర్పడి, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి పీఆర్సీ ఏర్పాటు, పెన్షన్ రూల్స్ సాధన, అప్రెంటిస్ విధానం రద్దు కోసం ఎస్టీయూ సంఘం చేసిన కృషిని కొనియాడారు.

Also Read: Supreme court on EC: ఆధార్‌‌పై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఎస్టీయూ సంఘ చరిత్రను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య అడిషనల్ డైరెక్టర్ కే లింగయ్య, ఆర్జేడీ సత్యనారాయణ, రఘునాథ రెడ్డి, సంఘ రాష్ట్ర నాయకులు ఆట సదయ్య, ఎల్ఎం ప్రసాద్, జుట్టు గజేందర్, ఏవీ సుధాకర్, రవి, నర్సింహారెడ్డి, శంకర్ మాతంగి, పోల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణా రెడ్డి, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Also Read: KTR on Congress govt: రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?