Rajagopal Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

PCC-Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కదలికలపై పీసీసీ ఫోకస్?

PCC-Rajagopal Reddy

ఏం చేస్తున్నారు? ఎవరెవర్నీ కలుస్తున్నారనేదానిపై ఆరా
ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న అంతర్గత బృందం
కొంతమంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్లు ప్రచారం
ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పీసీసీ మరింత సీరియస్‌గా (PCC-Rajagopal Reddy) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కదలికలపై ఫోకస్ పెంచినట్టు సమాచారం. ఆయన ఏం చేస్తున్నారు?, ఎవరెవర్నీ కలుస్తున్నారు?, తదితర వివరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నది. పార్టీకి చెందిన ఓ ఇంటర్నల్ టీమ్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా ఆయన కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు, నిర్ణయాలను తప్పుబడుతూ మాట్లాడారు. సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్లతో పార్టీ దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు. ఏపీ కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదంటూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నిటితో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై పార్టీ కూడా స్పందించాల్సి వచ్చింది. క్రమ శిక్షణ కమిటీ మానిటరింగ్ చేయాలని సూచించింది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఓ కమిటీ పర్యవేక్షిస్తున్నది. కానీ, రాజగోపాల్ రెడ్డి విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.

Read Also- Sahasra case: సహస్ర కేసుపై జనం వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవే!

ఎమ్మెల్యేలతో భేటీ…?
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓ సీక్రెట్ మీటింగ్ జరిపినట్టుగా ప్రచారం జరుగుతున్నది. పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియాలోనూ పుల్ సర్క్యూలేట్ అవుతున్నది. సుమారు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనతో కలిసినట్లు తెలిసింది. 2 రోజుల క్రితం ఓ సీక్రెట్ ప్లేస్‌లో మీటింగ్ జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతుండటంతో పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కాస్త అలజడి మొదలైనది. పార్టీ వర్గాలు కూడా ఈ అంశంపై అన్వేషిస్తున్నాయి. పైగా అదే రోజు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో మరింత హాట్ టాఫిక్‌గా మారింది. ఢిల్లీలోనూ రాజగోపాల్ రెడ్డి కదలికలపై ఇటు పార్టీతో పాటు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం గమనార్హం.

Read Also- Jangaon district: స‌ర్కారు సాయంతో సోలారు వెలుగులు.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవి కోసమేనా?
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరే సమయంలోనే ఆయన మంత్రి పదవి హామీ లభించింది. స్వయంగా ఏఐసీసీ నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఆ టాస్క్‌ను కూడా పూర్తి చేశారు. కానీ, తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని భావించిన ఆయన, వరుసగా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని, తనకు ఎందుకు ఇవ్వరంటూ పార్టీని నిలదీశారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇచ్చారని, 11 మంది ఎమ్మెల్యేలకు కలిగిన నల్లగొండకు ముగ్గురు ఉంటే తప్పేమిటి? అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేపట్టినా, తాను భయపడేది లేదంటూనే పార్టీకి అల్టిమేట్ జారీ చేస్తూ వస్తున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?