CM Revanth Reddy review on Telangana Formation Day
Politics

Telangana Formation Day: పదేళ్ల పండుగ.. అంగరంగ వైభవంగా..!

– రాష్ట్ర అవతరణ వేడుకలకు భారీ ఏర్పాట్లు
– పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
– ట్యాంక్ బండ్‌పై 80 స్టాల్స్
– తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా సంబురాలు
– రాష్ట్ర చిహ్నానికి తుది రూపు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Telangana: జూన్ 2కి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో అంబరాన్నంటేలా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సహా పలువురు పరిశీలించారు. అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

పరేడ్ గ్రౌండ్‌లో షెడ్యూల్ ఇదే

రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. జూన్ 2న ఉదయం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్తారు. అక్కడ కార్యక్రమంలో ముందుగా, రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి తన సందేశాన్ని ఇస్తారు సీఎం.

ట్యాంక్‌బండ్ పై ప్రత్యేక ఏర్పాట్లు

జూన్ 2న రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాక్ బండ్‌పై కార్నివాల్ నిర్వహించనున్నారు. 5వేల మంది పోలీసులు బ్యాండ్‌తో ప్రదర్శన ఇవ్వనున్నారు. దాదాపు 80 స్టాళ్లను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. చేనేత, స్వయం సహాయక బృందాలు, హస్తకళలు ఇలా పలువురు తయారు చేసిన వస్తువుల అమ్మకానికి స్టాల్స్ ఉంటాయి. అలాగే, ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, ట్యాంక్ బండ్‌పై లేజర్ షోతోపాటు, టపాసులు ఇంకా ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

రాష్ట్ర చిహ్నం మార్పుపై సీఎం సమీక్ష

రాష్ట్ర అవతర వేడుకల నేపథ్యంలో రాష్ట్ర గేయంతోపాటు, కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకుంటోంది.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు