balayya-babu(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బాలయ్యకు చోటు.. ఎందుకంటే?

Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణను మరో అరుదైన గౌరవం వరించింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో ఆయన పేరు చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు. ఆయన హీరోగా ప్రస్థానం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ యాభై ఏళ్లలో తాత తండ్రి, మనువడిగా అనేక పాత్రలు వేశారు. ఇన్ని పాత్రలు వేసినా నేటికీ హీరోగా కొనసాగుతున్నారు. ఈ మేరకు ఆయన్ని ఈ అవార్డు వరించింది. దీనికి సంబంధించి ఈ నెల 30 వ తేదీన బాలకృష్ణను సత్కరించనున్నారు. ఈ అరుదైన పురస్కారానికి ఎంపికైనందుకు నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read also-Ganesh Chaturthi: పర్యావరణహిత వినాయక చవితి జరపండి.. జన విజ్ఞాన వేదిక సూచన

బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన సినీ జీవితాన్ని బాల నటుడిగా 1974లో “తాతమ్మ కల” చిత్రంతో ప్రారంభించారు. ఇది ఆయన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఆ తర్వాత, 1984లో “మంగమ్మ గారి మనవడు” చిత్రంతో కథానాయకుడిగా తన జర్నీని మొదలుపెట్టారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి, బాలకృష్ణకు స్టార్ హీరో హోదాను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ విభిన్నమైన పాత్రల్లో నటించి, తన నటనా ప్రతిభను చాటుకున్నారు. “సమరసింహారెడ్డి”, “నరసింహ నాయుడు”, “లెజెండ్”, “అఖండ” వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.

Read also-OG Update: వపన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీరా’ నుంచి మరో సాంగ్ వచ్చేది అప్పుడే!

నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో ఒక లెజెండ్‌గా, రాజకీయవేత్తగా, మరియు సామాజిక సేవకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన అభిమానులకు “నటసింహం”గా, సమాజానికి సేవకుడిగా, మరియు ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. బాలకృష్ణ యొక్క సినీ జీవితం మరియు సామాజిక కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!