TG ( Image source: Twitter)
తెలంగాణ

Telangana: నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్ గా తెలంగాణ.. మంత్రి శ్రీధర్ బాబు

Telangana: భావి తరాల కోసం మూసీనది ప్రక్షాళన చేసి తీరుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారని అయినా వెనక్కి తగ్గేదే లేదని వెల్లడించారు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతామని స్పష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అన్నారు.

Also Read: Medchal District: బాచుపల్లిలో నయా దందా రికార్డుల తారుమారు.. అసలైన పట్టాదారుల భూములు క‌బ్జా?

పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమన్నారు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని పేర్కొన్నారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి – ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

Also Read: Viral Video: నిర్మానుష్య వీధిలో వెళ్తోన్న వ్యక్తి.. మీదకు దూసుకొచ్చిన 7 కుక్కలు.. తర్వాత జరిగిందిదే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!