Jingo Second Look : దాలి ధనంజయ్ ‘జింగో’ నుంచి సెకండ్ లుక్
jingo(inage :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Jingo Second Look : యాక్షన్ కామెడీ చేయబోతున్న ‘జింగో’.. ఈ లుక్ చూశారా?

Jingo Second Look : ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కన్నడ నటుడు దాలి ధనంజయ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన హీరోగా నటిస్తున్న “జింగో” సినిమా సెకండ్ లుక్ (Jingo Second Look )పోస్టర్ విడుదలైంది. దాలి పిక్చర్స్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. గత సంవత్సరం విడుదలైన “జింగో” అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనమే రేపింది. దాలి ధనంజయ్ చెప్పిన “జింగో మోనాలాగ్”, అందులో వినిపించిన “నారా నారా జింగో” పాట ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకుంది. ఈ విజయాన్ని బలంగా తీసుకున్న చిత్రబృందం, తొలుత చిన్న పట్టణం నేపథ్యంలో ఆలోచించిన కథను మరింత విస్తరించి, పెద్ద తెరపై చూడటానికి సరిపోయే విజువల్ ట్రీట్గా మలచుతున్నారు.

Read also- Chiru Odela Project: ‘చిరుఓదెల’ ప్రాజెక్ట్‌కు ఆ సంగీత దర్శకుడే కావాలంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ రిక్వెస్ట్!

దర్శకుడు శశాంక్ సోగల్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు ఇచ్చిన స్పందన మాకు మరింత బలాన్నిచ్చింది. అందుకే కథను భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. 2026లో విడుదలయ్యే ఈ సినిమా రాజకీయ వ్యంగ్యం, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను కలిపి ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. అద్భుతమైన నటీనటులను కూడా పరిచయం చేయనున్నాం” అని తెలిపారు. ఈసారి విడుదల చేసిన పోస్టర్‌లో అనేక సంకేతాలు దాగి ఉన్నాయని, పైకి సరదాగా కనిపించినా లోతుగా గమనిస్తే కథపై ఆసక్తికరమైన వివరాలు బయటపడతాయని దర్శకుడు శశాంక్ పేర్కొన్నారు. “సినిమా కూడా అలానే ఉంటుంది. ప్రతి వర్గం ప్రేక్షకుడికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. మొత్తంగా 2026లో జింగో ప్రేక్షకులను అలరిస్తుంది” అని ఆయన అన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..