MP Etela Rajender: సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్(Etala Rajender) బేటీ అయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు వినతి పత్రాలు మంత్రికి అందజేశారు. సమావేశం అనంతరం సచివాలయ మీడియా పాయింట్ లో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు విసిరి వేసినట్టు ఎక్కడో దూరంగా ఉన్నాయని, అవి సరిగ్గా కేటాయింపులు జరగలేదని అన్నారు. కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్లు సరిగా లేవు. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండటం కష్టంగా ఉందని, రెండు నెలల్లో వీటికి పరిష్కారం చూపించాలని అన్నారు. ఎవరికైతే కేటాయించారో వారిని మాత్రమే ఉండేలా చూడాలని అన్నారు. కొత్తగా ఇల్లు కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు. నిజంగా పేదరికంలో ఉండి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల ఇవ్వలేదు ఆ లిస్ట్ను కూడా ఈరోజు మంత్రి గారికి ఇచ్చాను. ఇల్లు లేని వారికి పేదవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి తప్ప పైరవీలకు చోటివ్వవద్దని మంత్రిని కోరారు.
కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం
బస్తీలలో నివసించే వారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల(Double bedroom houses)ను కట్టిస్తే వారికి జీవనోపాధి సమస్య ఉండదు. కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, ఇళ్లల్లో పనిచేసే బ్రతికే వారికి అక్కడే ఇల్లు కట్టిస్తే లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉంటుందనీ కోరాను, దీనికి మంత్రిగారు సుముకత వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం వల్ల దర్వాజాలు కిటికీలు పీక్కుని పోతున్నారు. కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించి పేదవారికి ఇళ్లను కేటాయించాలని కోరాను. సిమెంట్ ధర, ఇనుము ధర, ఇసుక ధర, మేస్త్రీల ధర పెరిగింది ఐదు లక్షల రూపాయల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. కొన్ని నిబంధనలు సడలించి ఇల్లు కట్టుకునే వారికి సాయం అందించాలి.
Also Read: Swetcha Effect: ఎస్ఆర్ఎస్‌పి భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత
బ్రోకర్లు కలిసి ఇబ్బందులు
జవహర్ నగర్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అవి ఆర్మీ భూములు. డంపు యార్డ్ వాసన పక్కన భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వారు అందరూ పేదవారే, కానీ రెండు మూడు లక్షల రూపాయల లంచం ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇల్లు కూలగొట్టిస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని పేదవాళ్లు కట్టుకునే ఇళ్లకు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి దృష్టికి తీసుకు వచ్చాము. మల్కాజిగిరి జిల్లా DRC మీటింగ్ సంవత్సరంనర అయినా జరగలేదు వెంటనే నిర్వహించాలని శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాము. నాలుగు లక్షల మెజారిటీతో నన్ను గెలిపించారు కాబట్టి బాధ్యతగా వారికోసం కష్టపడుతున్నాను. ప్రభుత్వం ఏదున్న ప్రజల సమస్యలను తీర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం జరిగే వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది.
Also Read: Diabetes Control: షుగర్ ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా? అయితే, రోజూ ఈ ఆకులను తినండి..!