Srinivas Goud: గౌడ్‌లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(BSrinivas Goud) డిమాండ్ చేశారు. వైన్ షాపులలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడ్‌లకు 15శాతం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ 25శాతం ఇస్తామని హామీ ఇచ్చిందని దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గన్‌పార్క్ వద్ద గౌడ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కుల వృత్తులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
Also Read:Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!
1145 మంది గీత కార్మికులు చనిపోయారు
హైదరాబాద్(Hyderabad)లో కల్లుపై కుట్ర చేసి కల్లును బంద్ చేశారన్నారు. గొల్ల కరుమలకు రూ.3లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఒక్క గొర్రె ఇవ్వలేదన్నారు. ముదిరాజ్‌లకు చేపలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రెండేళ్లలో తాటి, ఈత చెట్లపై నుంచి ప్రమాదానికి గురై 1145 మంది గీత కార్మికులు చనిపోయారని, తక్షణమే వారి కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరవాలన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు.
Also Read: GHMC: దోమల నివారణ పై చేతులెత్తేసిన అధికారులు.. విజృంభిస్తున్న దోమలు