Ram Charan: ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే ఆయన నటిస్తున్న, నటించబోతున్న సినిమాల అప్డేట్స్‌తో సోషల్ మీడియా అంతా చిరు నామస్మరణతో నిండిపోయింది. ఇక చిరు బర్త్‌డేని పురస్కరించుకుని ఇంటిలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కేక్ కట్ చేయగా, కేక్‌ని చిరు, రామ్ చరణ్ (Ram Charan) ఒకరినొకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతా బాగానే ఉంది..కానీ, ఈ వీడియోలో రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. అయ్యప్ప మాల ధరించి కేక్ ఎలా తింటారు? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
మాల ధరించినవారు కేక్ కట్ చేసి, దాన్ని తినిపించుకోవడంపై నెటిజన్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మాల ధారణలో ఉన్నప్పుడు కేక్ వంటివి తినడం దీక్ష నియమాలకు విరుద్ధమని, కేక్ తయారీలో గుడ్లు ఇతర మాంసాహార పదార్థాలు ఉండవచ్చని, కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు వాటిని తినకూడదని వారు వాదిస్తున్నారు. ‘మాల ధరించి ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం సరికాదు’, ‘దీక్ష నియమాలు పాటించలేనప్పుడు మాల ధరించడం ఎందుకు?’ అంటూ పలువురు నెటిజన్లు మెగా కుటుంబంపై విమర్శలు గుప్పించారు.
ఈ వీడియోపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు కేవలం కేక్ కట్ చేయడం, దాన్ని తినడం తప్పు కాదని, ముఖ్యంగా శాకాహార కేక్‌ల విషయంలో ఇది వర్తించదని పేర్కొంటున్నారు. మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై చిరంజీవి లేదా రామ్ చరణ్ వైపు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. అలాగే ఇందులో మెగాస్టార్ కాళ్లకి రామ్ చరణ్ నమస్కారం చేస్తున్నారు. మాలలో ఉన్నవాళ్లు అలా కాళ్లకి నమస్కారం చేయవచ్చా? అని మరొక నెటిజన్ ప్రశ్నను లేవదీశారు. దీనికి కన్న తల్లిదండ్రులకు పెట్టవచ్చని సమాధానమిచ్చారు.
Also Read- Chiru Odela: ఎన్ని టీజర్స్ వస్తే ఏంటి.. ఒక్క ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశాడుగా!
ఇక కేక్ విషయంలో జరుగుతున్న రచ్చపై మెగా ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ‘వెజ్ కేక్స్ కూడా ఉంటాయి. ఏదో ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లా నువ్వు నీ డౌట్స్ అంటూ..’ అంటూ ఓ మెగా ఫ్యాన్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది. మొత్తంగా అయితే.. ఈ కేక్ వ్యవహారం మాత్రం శుక్రవారం సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయింది.
RC mala lo unnara
Mala lo unna vallu Baita foods thintaara ?
That too cakesJust doubt anthe https://t.co/3GAkJMoPzK
— Hemanth Kiara (@UrsHemanthKiara) August 22, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు