CM Will Attend Iftar Dinner Tomorrow
Politics

Iftar Party : రేపే ఇఫ్తార్ విందు, హాజరుకానున్న సీఎం

CM Will Attend Iftar Dinner Tomorrow : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పండుగ రంజాన్. ఈ రంజాన్‌ మాసం ప్రారంభమై నేటికి మూడురోజులు అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు కోసం అన్నిరకాల ఏర్పాట్లను చేస్తోంది. ఈనెల 15న రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

అలాగే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి జరుగుతున్న ఇఫ్తార్ విందు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దగ్గరుండి మరీ.. బుధవారం అధికారులతో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

Read More: అయ్యో.. చివరికి ప్రతాపరెడ్డే దిక్కయ్యాడా..!

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రంజాన్ తొలి శుక్రవారం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నట్టు చెప్పారు. దీనికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అలాగే..రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ఈ ఇఫ్తార్‌ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికి భోజన సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు షబ్బీర్ అలీ చెప్పారు. ఇక ఈ నెల 12 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. నెల రోజుల పాటు ఈ ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు అల్లాను అత్యంత భక్తి శ్రద్దలతో మస్జీద్‌లో ప్రార్థిస్తారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!