Ponnam – Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లో ఎరువులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, బీటీ, జెడ్పి రోడ్డు రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు రూ. 8 కోట్ల 38 లక్షల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతర -2025 పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి తో కలిసి ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు, పలు గ్రామపంచాయతీ ఆవరణంలో మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పలు గ్రామాల్లోని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు ను అందించారు. పలు గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్ల గడప నిర్మాణం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రియాంక గాంధీ కూడా నిరసన
అక్కన్నపేట మండలం నందారంలో మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడుతూ రైతుల ఇబ్బందుల దృష్ట్యా అక్కన్నపేట ఫర్టిలైజర్ షాప్ ను సందర్శించడం జరిగిందన్నారు. అక్కడ 500 యూరియా సంచులు ఉన్నాయని, అంతకు తక్కువ మంది రైతులు క్యూలైన్ లో ఉన్నా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన విధంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి(CM), మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఎరువుల కొరత విషయమై పార్లమెంట్ సభ్యులు ప్రియాంక గాంధీ కూడా నిరసన తెలిపారన్నారు. రైతులను భయాందోళన చెందే విధంగా చేస్తున్నారని, రైతులకు ఎరువులు ఇప్పించే బాధ్యత తమదన్నారు. యూరియా కేంద్రాల వద్ద క్యూ లైన్ లో చెప్పులు పెట్టి, వారి పేపర్లు, టి న్యూస్ లో వేసుకొని బిఆర్ఎస్ వాళ్లు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రాంతానికి గుండె కాయ గౌరవెల్లి ప్రాజెక్ట్ అని ప్రాజెక్టుకు నిధులు కేటాయించామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని భూసేకరణ, కాలువల నిర్మాణం జరుగుతుందన్నారు.
Also Read: Ram Charan: నెవర్ బిఫోర్ లుక్‌లో.. ‘పెద్ది’ సర్‌ప్రైజ్‌కు సిద్ధమా!
గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో
హనుమకొండ(Hanmakonda) జిల్లా పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం 25 కోట్లు వచ్చాయనీ, సిద్దిపేట(Sidhipeta), కరీంనగర్(Karimnagar) జిల్లాలకు కూడా నిధులు వస్తాయన్నారు. కాలువల భూసేకరణ కు సహకరించి, నష్టపరిహారాన్ని తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరుపున తను, మూడు జిల్లాల కలెక్టర్ లు, ఆర్డీవో లు ఇతర అధికారులు సమీక్షిస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో ఎన్జీటి 10 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందని, ఆ ఫైన్ కూడా కట్టామన్నారు. సమస్య అధిగమించి కాలువల భూసేకరణ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఆర్డీవో వి.రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మెప్మా పిడి జయదేవ్ ఆర్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లు కంది తిరుపతిరెడ్డి, బోయిని నిర్మల జయరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, బంక చందు, మంద ధర్మయ్య, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, పలు శాఖ విభాగాల అధికారులు, మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Swetha Special Story: బడిని బతికించుకున్న ఊరు.. నాడు వెల వెల.. నేడు విద్యార్థులతో కల కల!