four-and-half-gang( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Malayalam Web Series: ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ట్రైలర్ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Malayalam Web Series: సోనీ లివ్‌లో ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్‌ల్లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ వెబ్ సిరీస్ అందరినీ అలరించడానికి వస్తుంది. యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 29న మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.

Read also- Pollution Check Vehicles: పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుల ఇష్టారాజ్యం.. అక్రమంగా ఫీజుల వసూళ్లు

‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అనే టైటిల్‌ను బట్టి చూస్తేనే కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ కథలో నలుగురు యువకులు, మురికివాడ నుండి వచ్చిన ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. ఇక ఈ ఊర్లో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఇక ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? ప్రత్యర్థుల నుంచి వచ్చే సమస్యలు ఏంటి? అక్కడి పూలు, పాల వ్యాపారాలను నియంత్రించే స్థానిక గ్యాంగ్ స్టర్‌తో ఈ గ్యాంగ్‌కు వచ్చే ప్రమాదం ఏంటి? అన్నదే కథ.

Read also- Tummala Nageswara Rao: అధికారం కోల్పోయిన పార్టీలవి చిల్లర మాటలు.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

మ్యాన్‌కైండ్ సినిమాస్ నిర్మించిన ఈ సిరీస్‌కు(Malayalam Web Series) క్రిషాంద్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో జగదీష్, ఇంద్రన్స్, విజయరాఘవన్, హకీం షా, దర్శన రాజేంద్రన్, సంజు శివరామ్, సచిన్, శాంతి బాలచంద్రన్, నిరంజ్ మణియన్ పిళ్లై, శ్రీనాథ్ బాబు, శంబు మీనన్, ప్రశాంత్ అలెక్స్, రాహుల్ రాజగోపాల్, విష్ణు అగస్త్య వంటి వారు నటించారు. డార్క్ కామెడీ, యదార్థ ఘటనలు, ఎమోషన్స్‌తో తీసిన ఈ ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ఆగస్టు 29 నుండి మలయాళం, తెలుగు, తమిళ్, హింది భాషలలో సోనీ LIVలో మాత్రమే ప్రసారం కానుంది.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు