Good News to Govt Teachers: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ఎట్టకేలకు ప్రమోషన్లు దక్కనున్నాయి. ప్రభుత్వ, లోకల్ బాడీ మేనేజ్ మెంట్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్లుగా కొనసాగుతున్న పలువురికి జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు. మల్టీజోన్ 1, 2 లో కలిపి మొత్తం 880 మందికి ఈ పదోన్నతులు దక్కనున్నాయి. మల్టీజోన్ 1 పరిధిలో ప్రభుత్వ మేనేజ్ మెంట్ పరిధిలో 53 మందికి, లోకల్ బాడీలో 437 మందికి మొత్తం 490 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మల్టీజోన్ 2లో ప్రభుత్వ మేనేజ్ మెంట్ పరిధిలో 80 మందికి, లోకల్ బాడీ పరిధిలో 310 మందికి మొత్తం 390 మందికి పదోన్నతులు కల్పించనున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
మొత్తం 2324 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 640 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం ఆగస్టు 26లోగా భర్తీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కోర్టు కేసులు కూడా ఎదుర్కొని చివరకు పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. ఇదిలా ఉండగా గతేడాది జూలైలోనూ ప్రభుత్వం ప్రమోషన్లు, పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 47,244 మందికి ట్రాన్స్ ఫర్ చేశారు. 21419 మందికి ప్రమోషన్లు దక్కాయి. 1200 మంది టీచర్లు స్పౌస్ బదిలీల్లో బదిలీ అయ్యారు.
షెడ్యూల్ ఇదే..
❄️ఆగస్టు 21 : ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-II (గెజిటెడ్), స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేడర్లకు సంబంధించిన ఆర్డర్లను రిలీజ్ చేశారు.
❄️ఆగస్టు 22-24 : స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేడర్ల వేకెన్సీని ప్రదర్శించనున్నారు. అలాగే ఎస్జీటీల తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల సమర్పణకు అవకాశం కల్పించారు. అలాగే ఎస్జీటీల ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ను సైతం ప్రదర్శించనున్నారు.
❄️ఆగస్టు 25 : ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేడర్లకు చెందిన వారికి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. తప్పొప్పుల సవరణకు సైతం అదే రోజు అవకాశం కల్పించారు.
❄️ఆగస్టు 26 : సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేడర్ పోస్టులకు పదోన్నతి ఉత్తర్వులను జారీ చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేయనున్నారు.