manchu-vishnu(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Manchu Vishnu: ‘కన్నప్ప’ తర్వాత డేరింగ్ డెసిషన్ తీసుకున్న మంచు విష్ణు.. మళ్లీ వంద కోట్లతో..

Manchu Vishnu: ‘కన్నప్ప’ బ్లాక్ బస్టర్ తరువాత విష్ణు మంచు డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన చేయబోయే ప్రాజెక్టులు గురించి ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. ఇంతకూ ఏం చెయ్యబోతున్నారు అంటే మైక్రో డ్రామాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. అదే అయితే టాలెంట్ ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే ‘కన్నప్ప’తో పాన్ ఇండియా స్థాయిలో మంచు విష్ణు అందరికీ సుపరిచితం అయ్యారు. ఇలా మైక్రో డ్రామాలను కూడా ఎంకరేజ్ చేస్తే ఆయన స్థాయి మరింత పెరుగుతుంది. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రో డ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు.

Read also- Andhra King Taluka: రామ్ పోతినేని చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విడుదల ఎప్పుడంటే?

మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు.. ‘ఈ ఏడాది ‘కన్నప్ప’తో అత్యంత చర్చనీయాంశంగా విష్ణు నిలిచారు. తరువాతి తరం కథలను ఎలా చెబుతుంది? అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి? అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విష్ణు అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు’ అని అనుకుంటున్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.

Read also- Konda Surekha – Seethaka: మేము సమ్మక్క సారలమ్మ మాదిరి కలిసే ఉన్నాం.. మంత్రి కొండా సురేఖ

“కన్నప్ప” మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు, విష్ణు నిర్మించిన ఈ సినిమా భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. 200 కోట్ల బడ్జెట్‌తో న్యూజిలాండ్, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరిగింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. తిన్నడు (విష్ణు) గత జన్మ రహస్యం, కన్నప్పగా మారిన కథ ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, నటనకు ప్రశంసలు లభించాయి. సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురైనా, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ సంపాదించింది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?