Swetha Special Story (Image Source: Reporter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Special Story: బడిని బతికించుకున్న ఊరు.. నాడు వెల వెల.. నేడు విద్యార్థులతో కల కల!

Swetcha Special Story: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండ గ్రామస్థులు అంతా ఏకమయ్యారు. జెండాలు పక్కకు పెట్టి ఒకే ఎజెండాతో ముందుకు సాగారు. గ్రామస్తుల ఐక్యత, సంకల్ప బలంతో ఆరు సంవత్సరాల క్రితం మూతబడిన బడికి జీవంపోసి బతికించుకున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితిలో ఉంటే హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఏకంగా అడ్మిషన్లు లేవని బోర్డు పెట్టారు. బడిని బాగు చేసుకోవాలనే తపన, గ్రామస్తుల ఐక్యత, బడిని బాగు చేసుకున్న తీరు అనేక ప్రభుత్వ పాఠశాలలకు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే కదిలించిన ఒంటిమామిడిపల్లి గ్రామస్తుల స్పూర్తి, ప్రభుత్వ పాఠశాలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.


నాడు వెల వెల.. నేడు కలకల.
ఆంగ్ల విద్యకు ఆకర్షితులైన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామస్తులు తమ పిల్లలను గ్రామానికి వచ్చే స్కూల్ వ్యాన్లలో పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలకు పంపించడంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. విద్యార్థులు లేకపోవడంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను 2009 లో విద్యాశాఖ మూసివేసింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో నిరుపేదలకు చదువు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఒక్కతాటిపైకి వచ్చారు. పాఠశాలను కాపాడుకునేందుకు ఒక్కటిగా ముందుకు సాగారు. పాఠశాలను బతికించుకునేందుకు ఒక నియమావళిని రూపొందించుకున్నారు. ఆ నిబంధన ప్రకారం గ్రామంలోని అందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాల వాహనాల్లో పట్టణ ప్రాంతాలకు పంపవద్దని నిర్ణయించుకున్నారు. ఎవరికోసం ఎదురు చూడకుండ తల్లిదండ్రుల ఆర్థిక చేయుతతో ప్రభుత్వ అనుమతి లేకున్న 2015-2016 విద్య సంవత్సరంలో పాఠశాలను పునఃప్రారంభించుకున్నారు. వారే ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసుకుని పాఠశాల నిర్వహణ మొదలు పెట్టారు. మొదటి సంవత్సరం 272 మంది విద్యార్థులతో ప్రారంభం కాగా ఇప్పుడు 512 మంది విదార్థులకు సంఖ్య చేరుకుంది. విద్యార్థులు లేక మూతబడిన ఆ పాఠశాల ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతుంది.

దిగివచ్చిన ప్రభుత్వాలు
ప్రభుత్వ సహాయం లేకుండానే తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధి కమిటీ వేసుకుని వారే ప్రతి నెల కొంత పరిమితిలో డబ్బులు వసూలు చేసి సొంతనిధి ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో సంఘటితంగా నిర్ణయాలు తీసుకుంటూ 2015-2016 విద్యా సంవత్సరంలో 7వ తరగతి వరకూ పాఠశాల ప్రారంభించారు. క్రమశిక్షణతో ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాఠశాల పునఃప్రారంభించి నిర్వహిస్తున్న తీరుతో రాష్ట్రప్రభుత్వం స్పందించి పాఠశాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోనే మొదటి ఇంగ్లీష్ మీడియం అనుమతి పొందిన మొదటి ప్రభుత్వ పాఠశాలగా ఒంటిమామిడిపల్లి ఘనత సాధించింది. 2017 డీఎస్సీ తరువాత ఈ పాఠశాలకు ప్రభుత్వం 9 మంది ఉపాధ్యాయులను నియమించింది. మరోవైపు కేంద్రం ప్రభుత్వం సైతం ఈ పాఠశాల నిధుల లేని సమస్యను తీరుస్తూ పీఎం- సీహెచ్ఆర్ఐ పథకంకు ఎంపిక చేసింది.


పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డు
2009లో జీరో(0) స్ట్రెంత్ తో మూతపడిన ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల 2015- 2016 విద్యా సంవత్సరం.. 272 మంది గ్రామానికి చెందిన విద్యార్థులతో 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభం అయింది. ప్రతి సంవత్సరం అప్ గ్రేడ్ అవుతూ 2018 – 2019 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి చేరుకుంది. ప్రతి సంవత్సరం 100 శాతం మెరుగైన ఫలితాలు సాధిస్తూ టాప్ గా నిలుస్తోంది. ప్రతి విద్య సంవత్సరంలో బాసర ఐఐఐటిలో సీట్లు సాధించడంతో పాటు నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) కు ప్రతి విద్య సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు ఎంపిక అవుతూ వస్తున్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తుడడంతోపాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సొంత నిధి నుంచే స్వయంగా వారే వంట మనుషులను ఏర్పాటు చేసి మంచి మెనుతో రుచి సుచితో కూడిన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో గ్రామంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 512కు చేరింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు.

Also Read: Student Shoots Teacher: చెంపపై కొట్టిన టీచర్‌కు.. బుల్లెట్ దింపిన 9వ తరగతి విద్యార్థి.. ఎక్కడంటే?

ఆ సమస్యలతో ఇబ్బందులు
అనేక సవాళ్లను అధిగమించి తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక నిబంధనల ప్రకారం నర్సరీ నుంచి 10 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాల నిర్వహిస్తారు. ప్రభుత్వం సహాయం ఆశించకుండానే సొంత నిధితో నిర్వహణ చేస్తూ సౌకర్యాలు కల్పించుకున్నారు గ్రామస్థులు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఈ పాఠశాలకు కొన్ని సమస్యలు కూడ సవాల్ గా మారుతున్నాయి.

* సరిపడ తరగతి గదులు లేవు. ఇరుకు గదుల్లో తరగతుల నిర్వహణ చేయాల్సి వస్తోంది.
* ఉపాధ్యాయుల కొరత ఉండడంతో గ్రామస్థులు వేతనం ఇచ్చి ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించారు.
* ఇరుకైన ప్రాంగణంలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుంది.
* సరిపడ క్రీడా మైదానం లేదు.
* పాఠశాల నిర్వహణ నియంత్రణలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
* ప్రభుత్వ ఉపాధ్యాయుల పూర్తి సహకారం లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది.
* సరిపడ మూత్రశాలలు లేవు

అనేక సవాళ్లను అధిగమించాం!
అనేత సవాళ్లను తట్టుకొని పాఠశాలను కాపాడుకున్నమని గ్రామస్తులు చెబుతున్నారు. ‘మా గ్రామంలో పాఠశాల లేకపోవడంతో అనేకమంది పేద విద్యార్థులకు చదువుకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. 2009లో మూతపడిన పాఠశాలను పునః ప్రారంభించి నిలబెట్టేందుకు గ్రామస్థులందరం ఒక్కటిగా ముందుకు సాగాం. గ్రామస్తుల పట్టుదల సహకారంతో మేము మా బడిని బతికించుకోవడమే కాదు నేడు అనేకమందికి ఆదర్శంగా నిలిచాం. మా పట్టుదల చూసి ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం మాకు సంపూర్ణ సహకారం అందిస్తే మా బడిని మరింత మెరుగుగా తీర్చిదిద్దుకుంటాం’ గ్రామస్థుడు పొన్నాల రాజు అన్నారు.

Also Read: Viral Video: నెట్టింట రచ్చ చేస్తోన్న లేగ దూడ.. క్రేజ్ మామూల్గా లేదుగా!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!