Ghaati Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Ghaati Film Song: అనుష్క శెట్టి ‘ఘాటి’ సెకండ్ సింగిల్ దస్సోర దస్సోర.. ఎలా ఉందంటే?

Ghaati Film Song: అనుష్క శెట్టి (Anushka Shetty) నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అసలామె సినిమాలు చేస్తుందా? అనేలా కూడా ఒక టైమ్‌లో అనుమానాలు వచ్చాయి. సడెన్‌గా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)తో సినిమా చేస్తుంది. సగంపైన షూటింగ్ కూడా అయిపోయిందనే అప్డేట్‌తో అనుష్క అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా, విడుదల విషయంలో అనేక మార్లు ఈ సినిమా వాయిదా పడుతూ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురి చేస్తూనే ఉంది. ఇటీవల అధికారికంగా విడుదల తేదీ ప్రకటించి కూడా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక ఫైనల్‌గా ‘ఘాటి’ (Ghaati) సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత ప్రమోషన్స్ విషయంలోనూ కాస్త జోరు పెంచారు. రీసెంట్‌గా వదిలిన చిత్ర ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అనుష్క ఇందులో ఏ తరహా పాత్ర చేస్తుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Dasari Kiran Arrest: ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. తమ్ముళ్లూ హ్యాపీనా?

‘ఘాటి’ సెకండ్ సింగిల్ అంటూ ‘దస్సోర దస్సోర’ అనే లిరిక్స్‌తో సాగే లిరికల్ సాంగ్‌ (Dassora Lyrical Song)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట వినగానే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాగర్ నాగవెల్లి కంపోజ్ చేసిన ఈ సాంగ్ మొదలవగానే ఎనర్జీ, కల్చర్, వైబ్రెన్స్‌తో ఫుల్‌గా మూడ్ బూస్ట్ చేస్తుంది. ఘాటీల జీవన శైలిని, వారి కల్చర్‌ని పరిచయం చేసేలా వచ్చిన ఈ పాట ట్యూన్ కూడా ఆకట్టుకుంటోంది. ఈఎస్ మూర్తి ఈ పాటకు అందించిన సాహిత్యం ఘాటీల లైఫ్, వాళ్ల స్ట్రగుల్స్‌, పట్టుదలని రిఫ్లెక్ట్ చేసేలా ఉంది. గీతా మాధురి, సాకేత్, శృతి రంజనీ ఈ పాటను ఆలపించారు. క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read- Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!

ఈ సాంగ్ విజువల్స్‌లో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు‌తో పాటు ఇంకా ఉన్న ఘాటీల టీమ్ గంజా సీక్రెట్‌గా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ, పోలీసుల్ని తప్పించుకుంటున్న సీన్స్‌ని చూపించారు. ఇది సినిమా నేరేటివ్ ఎంత హై-స్టేక్స్‌లో ఉంటుందో తెలియజేస్తుంది. అలాగే బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ ఇంకా బలంగా ఇంపాక్ట్ చూపిస్తుందనేలా సాంగ్‌ని చిత్రీకరించారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, వస్తున్న ప్రమోషనల్ కంటెంట్.. వాటిని మరింతగా పెంచేస్తున్నాయి. ఘాటి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. అన్నట్టు.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాల్గొంటారనేలా టాక్ వినిపిస్తుంది. చూద్దాం.. ఆయన ఈ సినిమాకు ఏ విధంగా సాయం అందించబోతున్నారో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్