Salam Anali from War 2: యష్ రాజ్ ఫిల్మ్ (YRF) నిర్మాణంలో ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘వార్ 2’ (War 2 Movie). ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR).. నువ్వా? నేనా? అనేలా నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే ఈ సినిమా మిశ్రమ స్పందనను రాబట్టుకున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం మొదటి వీకెండ్ ఇద్దరు హీరోలు తమ సత్తా చాటారు. అయినా సరే, ఇంకా ఈ సినిమా కలెక్ట్ చేయాల్సింది కొండంత ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాతో నిర్మాతలకు భారీ లాస్ తప్పదు అనేలా టాక్ అయితే నడుస్తుంది. ఈ క్రమంలో ఎలాగైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని, మేకర్స్ రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ కాగా, అందులో.. హృతిక్ అద్భుతమైన డ్యాన్సర్ అని ఎన్టీఆర్ కితాబిచ్చాడు. హృతిక్ కూడా ఎన్టీఆర్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక వారిద్దరి కాంబోలో ఈ సినిమాలో రూపుదిద్దుకున్న ‘సలామ్ అనాలి’ పాటను మేకర్స్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయకుండా, థియేటర్స్‌లోనే చూడాలని ప్రకటించారు.
Also Read- Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. ఆ గుడి పూజారులు బయటకు నెట్టేశారు
కేవలం ‘సలామ్ అనాలి’ (Salam Anali from War 2) సాంగ్ ప్రోమోని మాత్రమే విడుదల చేసి, ఫుల్ సాంగ్‌ని థియేటర్లలో మాత్రమే చూడాలని తెలిపారు. అందులో ఉన్న సర్‌ప్రైజ్ డ్యాన్స్ అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేసేలా ఉంటుందని, అందుకే ఆ సాంగ్‌ని ముందుగా విడుదల చేయడం లేదని మేకర్స్ తెలిపారు. సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ దారుణంగా.. లక్షల్లో మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. దీంతో ఎలాగైనా, ప్రేక్షకులలో ఊపు తీసుకురావాలని భావించిన మేకర్స్.. బుధవారం (ఆగస్ట్ 20) ఈ సినిమాలోని ‘సలామ్ అనాలి’ ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియానే కాకుండా, యూట్యూబ్‌ని కూడా షేక్ చేస్తుంది.
Also Read- Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!
ఫ్యాన్స్ ఈ సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ సాంగ్‌పై పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇది డబ్బింగ్ సినిమా కావడంతో.. తెలుగు ప్రేక్షకులు సాంగ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కు ఓ క్రేజుంది. అలాగే స్పష్టమైన తెలుగు మాట్లాడటంలో ఎన్టీఆర్‌ని కొట్టేవారే లేరు. అలాంటి ఎన్టీఆర్ నోటి నుంచి పదాలు సింక్ కాకపోవడంతో.. ఆయన అభిమానులు కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక డ్యాన్స్ పరంగా చెప్పేదేముంది. ఎన్టీఆర్ ఎనర్జీ హైలెట్ అయితే.. హృతిక్ స్మూత్‌నెస్ ఈ పాటను ఎక్కడికో తీసుకెళుతోంది. తెలుగులో ‘సలామ్ అనాలి’ అంటూ సాగిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. నకాష్ అజిజ్, యాజిన్ నిజార్ ఆలపించారు. ఇక ఈ పాటకు బోస్కో లెస్లీ మార్టిస్ అద్భుతమైన స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు