Coolie A Certificate: సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ (Coolie Movie) సినిమా మొదటి వీకెండ్ బాగానే స్కోర్ చేసింది. కానీ వీక్ డేస్ మొదలవ్వగానే భారీగా కలెక్షన్స్ పడిపోయాయి. సోమవారం, మంగళవారం ఈ సినిమా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం అయితే మరీ దారుణంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 10 కోట్ల కంటే తక్కువ కలెక్షన్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 425 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా సమాచారం. ఇంకా దాదాపు రూ. 300 కోట్లు రాబడితేనే ఈ సినిమా బ్రేకీవెన్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని అయితే కాదు. అందుకే ఈ లాస్ నుంచి తప్పించుకోవడానికి సన్ పిక్చర్స్ నిర్మాత పెద్ద ప్లానే వేశారనేలా ఇప్పుడో విషయం బాగా హాట్ టాపిక్ అవుతోంది. అదేంటంటే.. (Coolie Censor Controversy)
Also Read- Naga Vamsi: సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై నిర్మాత నాగవంశీ సెటైరికల్ పోస్ట్
‘కూలీ’ సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ.. సన్ పిక్చర్స్ సంస్థ ఆ సినిమాను సెన్సార్ చేసిన బోర్డుపై కేసు ఫైల్ చేయించినట్లుగా తెలుస్తోంది. ‘కూలీ’ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సాధారణంగా రజినీకాంత్ సినిమాలు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉంటాయనే విషయం తెలియంది కాదు. ఆయన సినిమాలను అన్ని వయసుల వారు ఇష్టపడతారు. అందుకే ఆయన సూపర్ స్టార్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. కాకపోతే ‘కూలీ’ సినిమాకు వచ్చిన ‘A’ సర్టిఫికేషన్ వల్ల కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు సినిమా చూడటానికి వీలులేకపోవడంతో నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో ఉన్నవాటి కంటే భయంకరమైన హింసాత్మక సన్నివేశాలు ఉన్న సినిమాలకు యుబైఏ సర్టిఫికేట్ జారీ చేశారని తెలుపుతూ.. ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఇవ్వడంపై నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘కూలీ’ సినిమాకు సెన్సార్ బోర్డు హింసాత్మక సన్నివేశాల కారణంగా A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాను పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమాగా మిగిలిపోయింది. ఇది రజినీకాంత్ అభిమానులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను నిరాశపరిచడమే కాకుండా, సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిందని, విదేశీ సెన్సార్ బోర్డులు ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా UA సర్టిఫికేట్ ఇచ్చాయని, ఇదే సినిమాకు మన దేశంలో A సర్టిఫికేట్ రావడంపై నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ‘కూలీ’కి వచ్చిన సర్టిఫికేట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం లేదని, ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాత సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం, ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ వివాదం సినిమా విడుదలైన తర్వాత మొదలవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’లో కులశేఖరగా ఆ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల
ఇప్పుడు కోర్టు కలగజేసుకుని, ఈ సినిమాకు UA సర్టిఫికేట్ వచ్చేలా చేసినా.. కలెక్షన్లు మాత్రం పెరగవు. ఎందుకంటే, టాక్ అలా ఉంది. కాకపోతే, నిర్మాత ప్లాన్ మాత్రం వర్కవుట్ అవుతుంది. అదేంటంటే.. యుఏ సర్టిపికేట్ ఉంటే డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకునే నిర్మాత ఇలా ప్లాన్ చేశారని అంతా అనుకుంటున్నారు. థియేట్రికల్‌గా ఈ సినిమాతో వచ్చిన లాస్‌ను డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో రికవరీ చేసుకునేలా.. నిర్మాత పెద్ద ప్లానే వేశారనేలా.. ఈ వివాదంపై నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
