HHVM OTT ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

HHVM OTT: ఇదేం ట్విస్ట్ గురు.. ‘హరిహర వీరమల్లు’ ఓటిటీలో కొత్త క్లైమాక్స్?

HHVM OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన మొదటి పాన్-ఇండియా చిత్రం “హరి హర వీర మల్లు: పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్”. ఈ సినిమా పవన్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే, ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందు వరకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మొత్తంగా 7 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మలయాళం, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉన్నది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. థియేటర్లో రిలీజ్‌ అయినా కేవలం నాలుగు వారాలకే ఓటిటీలోకి రావడం విశేషం.

ఈ మూవీ మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత విమర్శకులు, ప్రేక్షకులు నుండి మిక్స్డ్ టాక్ రావడంతో.. ఈ చిత్రం పై వచ్చిన ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకుని టెక్నికల్ పరంగా కొన్ని మార్పులు చేసి ఓటిటీలో రిలీజ్ చేశారు.

Also Read: Damodar Rajanarsimha: జిల్లా ఆస్పత్రుల నుంచే స్క్రీనింగ్ జరగాలి.. వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టాలి

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు’ ఓటిటీ వెర్షన్‌లో సరికొత్త మార్పులతో సందడి చేస్తోంది. థియేటర్ వెర్షన్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్, పవన్ విల్లు పట్టిన సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత వీఎఫ్ఎక్స్ సన్నివేశాలను మెరుగుపరిచారు. కొన్ని సీన్స్‌ను పూర్తిగా తొలగించారు కూడా. చిత్రంలో అతి పెద్ద మార్పు ఏంటంటే… థియేటర్ వెర్షన్‌లో చివర్లో బాబీ డియోల్ చెప్పే “ఆంది వచ్చేసింది” సీన్‌తో పాటు, ఆయనతో పవన్ కళ్యాణ్‌కు మధ్య జరిగే తుపాను ఫైట్ సీన్‌ను ఓటిటీ వెర్షన్ నుంచి తీసేశారు. దీనికి బదులుగా “అసుర హననం” పాట తర్వాత సినిమా పార్ట్ 2 ప్రకటనతో ముగుస్తుంది. ఈ మార్పులతో సినిమా నిడివి దాదాపు 15 నిమిషాలు తగ్గి, 2 గంటల 33 నిమిషాలకు చేరింది.

Also Read: Jammulamma kalyanotsavam: వైభవంగా జములమ్మ కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు

థియేటర్‌లో సినిమా చూసినవారు ఓటిటీ వెర్షన్‌లో ఈ తేడాలను గుర్తిస్తారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాకు మూడు వేర్వేరు క్లైమాక్స్‌లను రూపొందించారని చెబుతున్నారు. ఓటిటీ వెర్షన్‌ను హోం ఆడియన్స్‌కు అనుగుణంగా పర్ఫెక్ట్‌గా ఎడిట్ చేశారని తెలుస్తోంది. అయితే, ఈ కొత్త వెర్షన్ ఆడియెన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Sudershan Reddy: ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఎంపిక

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, సునీల్, రఘు బాబు, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిశోర్, కబీర్ దుహాన్ సింగ్, దివంగత కోట శ్రీనివాసరావు (ఆయన చివరి చిత్రం) నటించారు. ఏఎం రత్నం సమర్పణలో, ఏ. దయాకర్ రావు నిర్మించిన ఈ ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. కొత్త క్లైమాక్స్‌తో ఓటిటీలోకి వచ్చిన ‘హరి హర వీర మల్లు’ మిమ్మల్ని అలరిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే! ఈ సరికొత్త వెర్షన్‌ను ఓటిటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Just In

01

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?