Barabar Premistha Song Launch
ఎంటర్‌టైన్మెంట్

Barabar Premistha: చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ పాట విడుదల.. అది అసలు డ్యాన్సేనా?

Barabar Premistha: మొదటి చిత్రంతోనే స్టార్ గుర్తింపును పొందిన హీరో ఎవరయ్యా? అంటూ అందరూ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ (Chandrahass) పేరే చెబుతారు. ఆయన మీడియా సమావేశాల్లో వ్యవహరించిన తీరు, ఇతరత్రా అన్నీ కలిపి చంద్రహాస్‌ని యాటిట్యూడ్ స్టార్‌ని చేశాయి. ఇప్పుడా యాటిట్యూట్ స్టార్ నుంచి వస్తున్న సినిమానే ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha). ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌ అయినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా ‘గుంజి గుంజి’ అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ‘రెడ్డి మామ’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ ట్రెండ్ అవ్వగా.. తాజాగా బన్నీ వాస్ విడుదల చేసిన ‘గుంజి గుంజి’ సాంగ్ (Gunji Gunji Lyrical Video).. యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌గా సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను సంగీత దర్శకుడు ధృవన్ స్వయంగా ఆలపించారు. ఇక ఈ పాటలో చంద్రహాస్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా అంతా మాట్లాడుకుంటున్నారు. అది అసలు డ్యాన్సేనా? కుర్రాడు కుమ్మేస్తున్నాడు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టుగా ఈ లిరికల్ సాంగ్ హింట్ ఇచ్చేస్తోంది.

Barabar Premistha Song Launch

Also Read- Live Worm In Eye: చూపు మసకబారడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. కంటిలో ఉన్నదాన్ని చూసి అవాక్కైన వైద్యులు!

ఇక ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం బన్నీ వాస్ మాట్లాడుతూ.. చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం నుంచి ‘గుంజి గుంజి’ అనే పాటను విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లో ఈ చిత్రం రాబోతోంది. ధృవన్ ఈ మూవీకి అదిరిపోయే సంగీతం అందించినట్లుగా ఈ పాటను చూస్తుంటే తెలుస్తుంది. ధృవన్ నేను నిర్మిస్తున్న మూవీకి కూడా పని చేస్తున్నారు. రోల్ రైడా మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటను అందరూ ఎంజాయ్ చేసేలా గణేష్ మాస్టర్ చిత్రీకరించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. బన్నీ వాస్‌కు చిత్రయూనిట్ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్