Niranjan reddy: రైతు సమస్యలను పరిష్కరించాలి
యూరియా కొరతను తీర్చాలి
నడిగడ్డలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్‌ను కోరిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
గద్వాల, స్వేచ్ఛ: రైతు సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌ను వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) మంగళవారం కలిసిశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పంటల సాగుకు ప్రభుత్వం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని, ఇప్పటివరకు వివిధ సంస్థల ద్వారా రైతులు 14,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి వినియోగించుకున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, ఇంకా 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంటలకు అవసరమవుతుందని కలెక్టర్‌కు చెప్పారు. జిల్లాకు రావాల్సిన యూరియా వాటా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నట్టు సమాచారముందని పేర్కొన్నారు. రైతులు ప్రతిరోజూ వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని,వెంటనే యూరియా రాకపోతే రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. నడిగడ్డలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Read Also- Urea Shortage: యూరియా కృత్రిమ కొరతపై ఎస్పీ వార్నింగ్
జూరాల ప్రాజెక్ట్ నిర్వహణపై దృష్టి పెట్టాలి
జూరాల ప్రాజెక్టు వద్ద గేట్ల ఐరన్ రోప్ తెగిపోవటంతో బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇనుప రోప్‌లు,రబ్బర్ సీళ్లు, ఇతర సాంకేతిక సామాగ్రి గేట్లకు మార్చాలన్నా, వాటిని అమర్చాలన్నా స్టాప్క్ గేటును జలాశయం గేట్ల వెనుక భాగంలో అడ్డుగా పెట్టి ముందు భాగంలో గేట్ల మరమ్మతులు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరమన్నారు. మరమ్మతుకు దాదాపు 4 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆయన ఆరోపించారు. ప్రసుత్తం జూరాల ప్రాజెక్ట్ ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, వరద 5.6 లక్షల క్యూసెక్కులు దాటితే అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలాల్సి ఉంటుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి పరిస్తితిలో గేట్లు మొరాయిస్తే నదీపరివాహక ప్రాంతంలో వరద జలాలు వెనక్కు మరలి గ్రామాలు ముంపునకు గురై తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. వారం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష సమావేశంలో జూరాల గేట్ల మరమ్మతు అంశం చర్చకు రాకపోవడం దారుణమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గేట్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
రిజర్వాయర్లు నిండాలి
రాష్ట్రంలోని అన్ని నదులు పొంగి పొర్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపడంపై దృష్టి పెట్టడం లేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. గద్వాల నియోజకవర్గంలోని సంగాల రిజర్వాయర్ 0.6 టీఎంసీ సామర్థ్యం ఉన్నా నేటికీ నింపలేదన్నారు. తాటికుంట రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టీఎంసీలు ఉంటే ఇంతవరకు కేవలం 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేశారన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పథకంలోని 99,100 ప్యాకేజీ పనులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also- Live Worm In Eye: చూపు మసకబారడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. కంటిలో ఉన్నదాన్ని చూసి అవాక్కైన వైద్యులు!
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో 50వేల మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు కాగా కేవలం 7 వేల మందికి మాత్రమే ఎల్‌వన్‌గా ఎంపిక చేశారని, అందులో కేవలం 1,000 ఇల్లు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో, నాగర్ దొడ్డి వెంకట రాములు,చక్రధర్ రావు,పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి,మోనేష్,పటేల్ జనార్దన్ రెడ్డి,గంజిపేట రాజు,వెంకటేష్ నాయుడు,వెంకటేశ్వర రెడ్డి,కురవ పల్లయ్య,డి.శేఖర్ నాయుడు,రాయపురం వీరేష్,జాంపల్లి భరత్ సింహారెడ్డి,ఎండీ.మాజ్,రజిని బాబు,గొనుపాడు రాము,చాకలి శ్రీనివాసులు,నరసింహులు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు,యూత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.