Suhas Birthday Special: సుహాస్ బర్త్‌డే (ఆగస్ట్ 19) నుంచి పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. అందులో ఆయన కొత్త చిత్రం ‘హే భగవాన్’ (Hey Bhagwan) టైటిల్ గ్లింప్స్‌ని ఒక రోజు ముందే విడుదల చేసిన మేకర్స్.. ఆ సినిమాతో సుహాస్ మంచి హిట్ కొట్టబోతున్నాడనే ఫీల్‌ని ఇచ్చేశారు. ఇప్పుడాయన చేస్తున్న మరో మూవీ నుంచి సుహాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ లుక్ విడుదల చేశారు. ఆ మూవీ ఏదో కాదు.. ‘మండాడి’ (Mandaadi Movie). ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ఈ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోంది. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోందని, శక్తివంతమైన ప్రదర్శనలు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ఈ సినిమా ఉంటుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. (Happy Birthday Suhas)
Also Read- Tummala Nageswara Rao: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలి.. మంత్రి తుమ్మల డిమాండ్!
విశేషం ఏమిటంటే.. ఇందులో సుహాస్ విలన్ పాత్ర చేస్తుండటం. ఇది సుహాస్‌కి కొత్తేం కాదు, అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వచ్చిన ‘హిట్ 2’ (Hit 2) మూవీలో సుహాస్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘మండాడి’ టీమ్ విడుదల చేసిన పోస్టర్ (Mandaadi Movie Suhas Poster)లో మాస్ లుక్స్‌లో సుహాస్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే ఈ సినిమాపై దృష్టి పడేలా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడీ పోస్టర్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ని షేర్ చేస్తూ.. నెటిజన్లు కూడా సుహాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి పేరు తీసుకు వస్తుందని ఇప్పటికే సుహాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సూరి (Soori), సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను దర్శకుడు మతిమారన్ పుగళేంది ప్రధానంగా చూపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్. ఆర్. కతిర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు