తెలంగాణ

Dharna at TG Secretaria: సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా.. మూడేళ్లుగా రూ.369 కోట్లు పెండింగ్

Dharna at TG Secretaria: తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడేళ్లుగా సుమారు రూ.369 కోట్లు పెండింగ్ ఉన్నాయని, అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తమ గోడు ఎవరూ వినడం లేదని, అందుకే ఆందోళనకు దిగామని కాంట్రాక్టర్లు తెలిపారు.

 Also Read: Power Cables Hyderabad: ఫ్లైఓవర్ల పైనా కుప్పలుగా కేబుల్ వైర్లు.. ఇంటర్నెట్ టెలిఫోన్ వైర్లతో ప్రమాదాలు

సెక్యూరిటీ స్టాఫ్​  షాక్

అయితే, ఏకంగా డిప్యూటీ సీఎం ఫ్లోర్‌లోనే ఆందోళనలు నిర్వహించడం గమనార్హం. కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాను చూసి సెక్యూరిటీ స్టాఫ్​ కూడా షాక్ అయ్యారు. చివరికి పోలీసు అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు సర్ది చెప్పాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడినట్లు సమాచారం. గతంలో ఓ సారి ఇదే ఫ్లోర్‌లో కాంట్రాక్టర్లు ధర్నా చేయగా, తాజాగా మరోసారి నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.

 Also Read: Medak District: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు… మునిగిపోయిన ఆలయం?

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?