Jeevan reddy pressmeet
Politics

Jeevan Reddy: నెహ్రూ హయాంలో వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి

Jawahar Lal Nehru: దేశం ఈ స్థాయికి చేరుకున్నదంటే అందుకు ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రూ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సాగు పరంగా, పారిశ్రామికంగానూ దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కానీ, కొన్ని దుష్ట శక్తులు ఆయన సేవలు, త్యాగాన్ని, ఘన కీర్తిని తగ్గించే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం కాలంలో దేశం శీఘ్రగతిన స్వయం పోశక, స్వయం సమృద్ధిగా ఎదగడానికి జవహర్ లాల్ నెహ్రూ ఎంతో శ్రమించారని వివరించారు. ‘అసలు దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే కదా! స్వతంత్ర దేశంలో తొలిసారిగా జాతీయ జెండానే ఎగరేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. అలాంటి కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సరికాదు’ అని జీవన్ రెడ్డి అన్నారు.

బీజేపీ నాయకులు, మోదీ మతాల మధ్య సామరస్యం దెబ్బతీసి చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారని, దాని వల్ల వారికి ఏమైనా న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని, వారు ఈ రిజర్వేషన్లకు అర్హులు కాదని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ‘ఎస్సీ, ఎస్టీలు హిందువులు కాదా? దేశంలో 75 శాతం మంది హిందువులకు మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం లేదు. అసలు హిందువుల కోసం మోదీ చేసిందేమిటీ? ఆర్థిక వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చామని చెప్పారు. తీరా చూస్తే బలహీనవర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించవని చెప్పారు. ఈ రిజర్వేషన్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాస్తున్నారు’ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం మినహా ఈ పదేళ్లలో బీజేపీ హిందువులకు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇతర రాజకీయా పార్టీలపైనే ఉన్నదని వివరించారు.

నెహ్రూ ప్రతిష్టను తగ్గించడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. నెహ్రూను విమర్శించేవాళ్లను చూసి నిజమైన దేశ భక్తులు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నెహ్రూ నడిచి దేశాన్ని నడిపించారని, పంచవర్ష ప్రణాళికలను నెహ్రూ తెచ్చాడని వీహెచ్ గుర్తు చేశారు. దేశంలో డ్యామ్‌లు నిర్మించింది నెహ్రూనే అని వివరించారు. కాంగ్రెస్ దేశానికి ఏమి తెచ్చింది అంటున్నారని, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే కదా అని తెలిపారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మోదీ ప్రైవేట్ చేస్తున్నారని, అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని వివరించారు.

Just In

01

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు