Congress MPs
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Urea Shortage: యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీల పోరు

Urea Shortage: పార్లమెంట్ వద్ద ప్లకార్డులతో ధర్నా

వాయిదా తీర్మానానికి ప్రతిపాదన
బీజేపీ ఎంపీలకు రైతుల సమస్యలు పట్టవా? అని నిలదీత

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: యూరియా కోసం (Urea Shortage) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పోరుబాట పట్టారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియాను కేటాయించడం లేదని ఆరోపించారు. పార్లమెంట్‌లోనూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ భవనం వద్ద ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన 8 లక్షల టన్నుల యూరియాను ఇవ్వలేదన్నారు. 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ఇంకా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

ప్రణాళికాబద్దం కాకుండా.. తక్కువ యూరియాను ఇచ్చారని, దీంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ‘‘కేంద్రమంత్రి నడ్డాను కూడా సమయం కోరాం. వారు సమయం కేటాయించకపోతే వారి కార్యాలయం ఎదుటే ఆందోళన చేస్తాం. కేవలం తెలంగాణ ఎంపీలే కాకుండా. మరో 25 మంది ఎంపీల మద్దతు కోరాం. ఈ నెల 21 వరకు జీరో అవర్ మోషన్ ఇస్తాం. ధర్నాలు చేస్తాం. 3 లక్షల టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలి’’ అని మల్లు రవి డిమాండ్ చేశారు.

Read Also- Viral News: రైల్లో పెంపుడు కుక్కను కట్టేసి వెళ్లిన యజమాని!.. అనూహ్య ఘటన

ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ‘‘నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నాను. నాతో పాటు ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ జరిగినా యూరియా సమస్యను లేవనెత్తుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు’’ అని అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఎంపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి నడ్డాను కలిశారని, జులైలోనే మొత్తం యూరియాను కేటాయించాలని కోరారని ప్రస్తావించారు. ఆగస్టు వరకు ఆపితే అన్నదాతలు ఇబ్బందులు పడతారని అప్పట్లోనే సీఎం రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా కేంద్రమంత్రి నడ్డాను కలిసి యూరియాను కేటాయించాలని కోరారని ఎంపీ కిరణ్ కుమార్ గుర్తుచేశారు. ‘‘అప్పట్లో యుద్ధం అంటూ సాకులు చెప్పారు. మళ్లీ పట్టించుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో రైతులంతా యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. ఇది ప్రజా సమస్య. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు కూడా నడ్డా దగ్గరకు రావాలి. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారు వీలైనంత వరకు ఒత్తిడి పెంచాలి. మేమంతా చిత్తశుద్ధితో యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Read Also- Medak District: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు… మునిగిపోయిన ఆలయం?

ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే యూరియా కొరత ఉందని, ఈ విధంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్షచూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రైతుల విషయంలో ఇలాంటి ఆలోచన మంచిది కాదన్నారు. రైతుల కోసం ఇప్పుడైనా బీజేపీ ఎంపీలు కలిసి రావాలని కోరారు. ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి యూరియా కొరతను ముందే ఊహించి.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. రైతుల కోసం పోరాడుతున్నామని, బీజేపీ ఎంపీలు ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించి ఏ సమస్యపైనా బీజేపీ పోరాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!